తెలంగాణలోని 5 జిల్లాల్లో మార్చి 31వరకు లాక్‌డౌన్: కేంద్రం

  • Published By: sreehari ,Published On : March 22, 2020 / 12:12 PM IST
తెలంగాణలోని 5 జిల్లాల్లో మార్చి 31వరకు లాక్‌డౌన్: కేంద్రం

Updated On : March 22, 2020 / 12:12 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో వైరస్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా విస్తరణతో జిల్లాల వారీగా కూడా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో కరోనా నిర్భందం కొనసాగనుంది. తెలంగాణ, ఏపీలో కూడా పలు జిల్లాలను లాక్ డౌన్ చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

తెలంగాణలోని ఐదు జిల్లాలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ ఐదు జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. అలాగే ఏపీలో కూడా మూడు జిల్లాల్లో నిర్బంధం కొనసాగించాలని ఆదేశించింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

తెలుగు రాష్టాలే కాకుండా ఇతర రాష్ట్రాలతో కలిపి మొత్తం 75 వరకు జిల్లాల్లో కర్ఫూ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ జిల్లాల నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రత్యేకించి ఈ జిల్లాలోని వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని రకాల ఆంక్షలను కేంద్రం అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖలవారీగా అందరిని సమన్వయపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది.