LockDown effect : లాక్‌డౌన్‌ నుంచి పెరిగిన నిరుద్యోగం, 34.7శాతం మందికి నిరాశ

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్ కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కార్మికులకు పనులు దొరకలేదు. ఇంటి పనివారంతా ఇంటికే పరిమితమయ్యారు.

LockDown effect : లాక్‌డౌన్‌ నుంచి పెరిగిన నిరుద్యోగం, 34.7శాతం మందికి నిరాశ

Lockdown Effect

Updated On : March 15, 2021 / 7:50 AM IST

LockDown effect: కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా యువతపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్ కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కార్మికులకు పనులు దొరకలేదు. ఇంటి పనివారంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకూ నిరుద్యోగ రేటు రెండింతలై 21శాతానికి చేరింది. 29ఏళ్లలోపు యువతలో 21.1 శాతం నుంచి 34.7శాతంగా వెల్లడైంది.

లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా కార్మిక బలగం, ఉపాధి, నిరుద్యోగంపై కేంద్ర గణాంక శాఖ క్వార్టర్ రిపోర్ట్ ఇటీవల రిలీజ్ చేసింది. 1.71లక్షల మందితో ఫోన్ సర్వే ద్వారా వివరాలు తీసుకుని ఈ నివేదికను రూపొందించింది.

లాక్‌డౌన్ సమయంలో వేతన జీవులు కాకుండా ఇతర రంగాల్లోని కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వలస కార్మికులు సొంత గ్రామాల బాట పట్టారు. వైరస్ వ్యాప్తి భయంతో ఇంటి పనివారిని యజమానులు రానీయలేదు. అంతకుముందు మూడు నెలలతో పోల్చితే 5.1శాతం నుంచి 3.8శాతానికి పడిపోయారు.

చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను నిర్వహిస్తున్న వారిలో 10శాతం మంది ఉపాధికి దూరమయ్యారు. దినసరి కూలీల పరిస్థితి మరింతి ఘోరంగా మారింది. దాదాపు సగానికి పైగా మందికి ఉపాధి పోయింది. ఇదే సమయంలో స్వయం ఉపాధి, వేతన జీవుల ఉపాధిపై ప్రభావం పెద్దగా లేదు.

జనవరి – మార్చి నాటికి నిరుద్యగో రేటు 9.6శాతం ఉఏంటే, ఏప్రిల్ – ఝూన్ నాటికి 21శాతంగా నమోదైందని నివేదిక వెల్లడిస్తోంది. తెలుగు రాష్ట్రా 15-29ఏళ్ల వయసులేని కార్మిక బలగంపై సర్వే చేసినప్పుడు ఏపీలో 46.4శాతం, తెలంగాణాలో 42.3శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. లాక్‌డౌన్ కాలంలో నిరుద్యోగ రేటు రేటు ఏపీలో 24.7శాతంగా ఉంటే, తెలంగాణలో 26.4శాతం ఉన్నట్లు వెల్లడైంది.