ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్.. దూసుకుపోతున్న స‌మాజ్‌వాదీ పార్టీ

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్.. దూసుకుపోతున్న స‌మాజ్‌వాదీ పార్టీ

Updated On : June 4, 2024 / 2:00 PM IST

Lok Sabha Election 2024 Result: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, స‌మాజ్‌వాదీ పార్టీ పుంజుకోవడంతో యూపీలోకమలం పార్టీకి ఈసారి సీట్లలో భారీకోత పడేలా ఉంది. గత ఎన్నికల్లో 62 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి దాదాపు సగం సీట్లు కోల్పోయేలా ఉందని తాజా ఎన్నికల ఫలితాల ట్రెండ్ సూచిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.

తాజా ఎన్నికల ఫలితాల్లో స‌మాజ్‌వాదీ పార్టీ దూసుకుపోతోంది. 36 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 8 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ 32 స్థానాల్లో తన హవా కొనసాగిస్తోంది. ఆజాద్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌, అప్నాదళ్(సోనిలాల్) పార్టీలు ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే ఇండియా బ్లాక్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ రెండో స్థానానికి పరిమితమవుతుంది.