Speaker Om Birla : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనను రాజకీయం చేయడం తగదు : స్పీకర్ ఓం బిర్లా
సభలో జరుగుతున్న గందరగోళాన్ని దేశ ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. సభలో బిల్లులపై సభ్యులు వారి వారి అభిప్రాయాలను చర్చల ద్వారా సభ ముందు ఉంచాలని కోరారు.

Lok Sabha Speaker Om Birla
Lok Sabha Speaker Om Birla Statement : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రకటన చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా సభ్యులు ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని తెలిపారు. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. సభా మర్యాదలు, గౌరవాన్ని అందరూ పాటించాలని సూచించారు.
సభలో జరుగుతున్న గందరగోళాన్ని దేశ ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. సభలో బిల్లులపై సభ్యులు వారి వారి అభిప్రాయాలను చర్చల ద్వారా సభ ముందు ఉంచాలని కోరారు. సభలో నిరసనలు, ప్లకార్డులు ప్రదర్శించడం ప్రజలు ఇష్టపడరని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. లోక్ సభ సభ్యుల భద్రత తనదేనని అన్నారు.
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ ని ఢీకొట్టిన కారు
మరోవైపు లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శించొద్దని బీఏసీలో నిర్ణయించామని పార్లమెంటరి వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. నిరసనలు పక్కన పెట్టి సభలో జరిగే చర్చల్లో సభ్యులు పాల్గొనాలన్నారు. 17వ లోక్ సభలో జరిగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే పూర్తి స్థాయి సమావేశాలను సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు.