లోక్‌స‌భ స్పీక‌ర్ ఇంట్లో విషాదం

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2020 / 03:46 PM IST
లోక్‌స‌భ స్పీక‌ర్ ఇంట్లో  విషాదం

Updated On : September 30, 2020 / 4:04 PM IST

Lok Sabha Speaker:లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి ఓంబిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు.జ‌స్థాన్ రాష్ట్రం కోటాలోని త‌న నివాసంలో శ్రీకృష్ణ బిర్లా తుదిశ్వాస విడిచారు. శ్రీకృష్ణ బిర్లా గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని, మంగ‌ళ‌వారం ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించార‌ని కుటుంబస‌భ్యులు తెలిపారు.


కాగా పితృవియోగంతో విషాదంలో మునిగిపోయిన ఓం బిర్లా, ఆయన కుటుంబానికి సహచర ఎంపీలు, బీజేపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శీకృష్ణ బిర్లా మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, ఎంపీ సుప్రియా సూలే తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

శ్రీకృష్ణ బిర్లా కూడా గ‌తంలో కోటా నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు.కాగా,ప్రస్తుతం ఓం బిర్లా కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.