LTTE Prabhakaran: ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. సంచలన ప్రకటన చేసిన నెడుమారన్

నెడుమారన్‌కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది. తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నెడుమారన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు.

LTTE Prabhakaran: ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. సంచలన ప్రకటన చేసిన నెడుమారన్

Updated On : February 13, 2023 / 1:42 PM IST

LTTE Prabhakaran: ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ గురించి ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని నెడుమారన్ ప్రకటించారు. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడిన నెడుమారన్ కీలక విషయాన్ని వెల్లడించారు.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

నెడుమారన్‌కు ప్రభాకరన్ సన్నిహితుడిగా పేరుంది. తంజావురులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నెడుమారన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు. ప్రభాకరన్ అనుమతితోనే నేను ఈ ప్రకటన చేస్తున్నా. ప్రభాకరన్ గురించి తమిళులకు ఈ శుభవార్త చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నా. అయితే, ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. కానీ, త్వరలోనే తమిళ ఈలం కోసం ఆయన తన కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ప్రభాకరన్‌కు మద్దతివ్వాలి.

US General: ‘ఏలియన్స్ విషయాన్ని కొట్టిపారేయలేం’.. గగనతలంలో అనుమానాస్పద వస్తువులపై అమెరికా అభిప్రాయం

తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా ఆయనకు అండగా నిలవాలి. రాజపక్సె పాలనలో శ్రీలంక వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా, ప్రభాకరన్ బయటకు వచ్చేందుకు ఇదే మంచి సమయం’’ అని నెడుమారన్ అన్నారు. 2009లో శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య జరిగిన కాల్పుల్లో ప్రభాకరన్ మరణించారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పటి శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది.