Mahadev betting app : దుబాయ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని రవి అరెస్ట్
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దుబాయ్ లో అదుపులోకి తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న రవిని ఇంటర్‌పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు....

Mahadev betting app owner
Mahadev betting app : మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దుబాయ్ లో అదుపులోకి తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న రవిని ఇంటర్‌పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత వారం నిర్బంధంలో ఉన్న రవి ఉప్పల్‌ను భారత్‌కు రప్పించేందుకు అరబ్ దేశాధికారులతో ఈడీ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారని మనీలాండరింగ్ నిరోధక సంస్థ ఈడీ తెలిపింది.
ALSO READ : Lok Sabha election : లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని మోదీ సమాయత్తం
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ నగరంలో మనీలాండరింగ్ యాక్ట్ కింద రవి, ఇంటర్నెట్ ఆధారిత బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు చెందిన మరో ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ముంబయి పోలీసులు కూడా రవిపై కేసును విచారిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రవి, ఇతరులు మనీలాండరింగ్, హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నరని తేలింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ALSO READ : Telangana CM Revanth Reddy : తెలంగాణలో బదిలీల పర్వం…రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి టీం
ఈడీ బెట్టింగ్ యాప్ విచారణ సందర్భంగా సినీనటులు రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, హుమా ఖురేషి, కపిల్ శర్మ, బోమన్ ఇరానీ,హీనా ఖాన్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. రవి, చంద్రాకర్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి నగదును స్వీకరించినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.