Lok Sabha election : లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని మోదీ సమాయత్తం

దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాయత్తం అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శల స్వరాన్ని పెంచారు....

Lok Sabha election : లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని మోదీ సమాయత్తం

Prime Minister Narendra Modi

Lok Sabha election : దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాయత్తం అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శల స్వరాన్ని పెంచారు. ప్రతిపక్షాల నేతలను పదునైన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, ఎమోజీలతో సోషల్ మీడియాలో విభిన్నమైన పోస్టులకు మోదీ శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు యువతను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో మోదీ విభిన్న పోస్టులు పెడుతున్నారు.

ALSO READ : Telangana CM Revanth Reddy : తెలంగాణలో బదిలీల పర్వం…రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి టీం

ప్రధాని మోదీ తన విమర్శల జోరును పెంచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ పై హ్యాండిల్‌ను అనుసరిస్తున్న నెటిజన్లు చెప్పారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు నుంచి డిసెంబరు 12వతేదీన లెక్కలోకి రాని నగదును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దీనిపై మోదీ ఎక్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అవినీతి బాగోతం అంటూ మోదీ విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఒక రోజు తర్వాత ప్రధాని మోదీ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ALSO READ : New Chief Ministers : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ సీఎంల ప్రమాణస్వీకారం నేడు

70 ఏళ్లుగా ఉన్న అలవాటు అంత తేలికగా మానదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలను గుప్పిస్తున్నారు. మోడీ తన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఎలాంటి పంచ్‌లు వేయలేదు. ప్రస్థుతం తాజాగా పార్లమెంటు ఎన్నికలకు మోదీ సమాయత్తమై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై పదునైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ALSO READ : Hamas Tunnels : గాజాలోని హమాస్ సొరంగాల్లోకి సముద్రపు నీటి పంపింగ్

ఒక వైపు బీజేపీ కార్యకర్తలను లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం చేస్తూనే ప్రచారానికి మోదీ వ్యూహాన్ని రూపొందించారు. బీజేపీ నేతలను కూడా ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ మోదీ ముందుకు సాగుతున్నారు. బుధవారం మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవంతో నరేంద్రమోదీ ప్రచారంలోనూ కొత్త వ్యూహాలు రూపొందించారు.