Maratha Quota : మరాఠా రిజర్వేషన్ డిమాండ్ ఉద్యమం…బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

మహారాష్ట్రలో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమం ముమ్మరం చేశారు.....

Maratha Quota : మరాఠా రిజర్వేషన్ డిమాండ్ ఉద్యమం…బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

Maratha Quota Demand

Updated On : October 31, 2023 / 6:54 AM IST

Maratha Quota : మహారాష్ట్రలో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమం ముమ్మరం చేశారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని గెవ్రాయ్ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం బీడ్ జిల్లాలో మరాఠా కోటా ఆందోళన సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది.

Also Read : German tattoo artist Shani Louk : హమాస్ మరో దారుణం…జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్‌ను కిడ్నాప్ చేసి ఏం చేశారంటే…

మరాఠా కోటా సమస్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని గెవ్రాయ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే లక్ష్మణ్ పవార్ అన్నారు. ‘‘మరాఠా కోటా సమస్య చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. మరాఠా సమాజం యొక్క డిమాండ్‌కు నేను నా మద్దతు ఇస్తున్నాను. నేను నా రాజీనామాను సమర్పిస్తున్నాను’’ అని పవార్ శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు పంపిన లేఖలో తెలిపారు.

Also Read : Harish Rao : గన్‌మెన్ అలర్ట్‌గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది- హరీశ్ రావు

మహారాష్ట్రలోని నాసిక్, హింగోలికి చెందిన శివసేన ఎంపీలు, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే విధేయులు ఇద్దరూ మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా రాజీనామా చేసిన నేపథ్యంలో లక్ష్మణ్ పవార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్ కోటా కోసం ఒత్తిడి తేవాలని ఉద్యమకారుడు మనోజ్ జరంగే నేతృత్వంలోని మరాఠా సంఘం సభ్యులు ఆందోళనను ప్రారంభించారు. జాల్నా జిల్లాలోని ఒక గ్రామంలో అక్టోబర్ 25 నుంచి జారంగే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.