Uddhav Thackeray : ఆర్థిక శాఖ అధికారులతో ‘మహా’ సీఎం భేటీ

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు భేటీ అయ్యారు.

Uddhav Thackeray : ఆర్థిక శాఖ అధికారులతో ‘మహా’ సీఎం భేటీ

Maharashtra Cm Uddhav Thackeray

Updated On : April 12, 2021 / 11:38 AM IST

Maharashtra CM Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు భేటీ అయ్యారు. అలాగే కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ అధికారుతో కూడా సీఎం ఈ రోజు రాత్రి 8.30 గంటలకు భేటీ కానున్నారు. ట్రేడర్లతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

బీజేపీ నేతలు సహా కొంతమంది మంత్రులతో కూడిన ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయగా.. ఏప్రిల్ 10న మహారాష్ట్రలో కఠినమైన లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం సంకేతాలిచ్చింది.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలపై స్పందించారు. లాక్ డౌన్ కారణంగా ప్రభావం పడే రంగాలకు ఆర్థిక ప్యాకేజీ అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు.