Ajit Pawar: ఎన్సీపీ మెజార్టీ సభ్యుల మద్దతు నాకే: అజిత్ పవార్
అందుకే మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Ajit Pawar, Eknath Shinde
Ajit Pawar -Maharashtra: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన మెజార్టీ సభ్యుల మద్దతు తనకే ఉందని అజిత్ పవార్ అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) కు షాక్ ఇచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కేబినెట్ లో చేరిన ఆయన అనంతరం మాట్లాడారు.
తాను రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. భారతదేశ అభివృద్ధే తమ ప్రాధాన్య అంశంగా నిర్ణయించామని అన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశామని తెలిపారు. ఏయే నేతకు ఏయే మంత్రి పదవులు ఉంటాయన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తాము శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, మరి బీజేపీతో కలిసి ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ షిండే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతోందని, అలాగే, తమ పార్టీ గుర్తు మీదే భవిష్యత్తులోనూ పోటీ చేస్తామని అన్నారు.
Eknath Shinde: ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ సర్కార్: మహారాష్ట్ర సీఎం షిండే