Maharashtra : దావూద్ ఇబ్రహీం సోదరితో..నవాబ్ మాలిక్‌కు సంబంధాలున్నాయి : ఈడీ

మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు దావూద్ ఇబ్రహీం సోదరితో సంబంధాలున్నాయని కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారా ఈడీ అధికారులు.

Maharashtra : దావూద్ ఇబ్రహీం సోదరితో..నవాబ్ మాలిక్‌కు సంబంధాలున్నాయి :  ఈడీ

Maharashtra Former minister Nawab Malik not innocent, he was dealing with Dawood Ibrahim's

Updated On : September 15, 2022 / 12:49 PM IST

Former minister Nawab Malik Money Laundering case : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌ అమాయకుడు కాదని అతనికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరితో సంబంధాలున్నాయని కోర్టుకు వెల్లడించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). దావూద్ ఇబ్రహీం, ఆయన సన్నిహితులతో సంబంధాలున్నాయని..అటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు బుధవారం (సెప్టెంబర్ 14,2022) విన్నవించింది ఈడీ.

మనీ లాండరింగ్ కేసులో గత ఫిబ్రవరి 23న ఈడీ మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోను.. ఆయన సన్నిహితులతో సంబంధాలు మాలిక్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం కోర్టు ఆయనను రిమాండుకు విధించిది. రిమాండ్ లో ఉన్న మాలిక్ బెయిల్ ఇవ్వాలని  న్యాయస్థానాన్ని కోరుతూ పిటీషన్ వేశారు. దీంతో మాలిక్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలను వినిపిస్తూ నవాబ్ మాలిక్ అమాయకుడు కాదని కోర్టుకు తెలిపారు. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ తో మాలిక్ కు సంబంధాలు, లావాదేవీలు ఉన్నాయని వివరించారు. కాబట్టి ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనే బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.

దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ వివాదాస్పద ల్యాండ్ సెటిల్మెంట్ల దందా చేస్తుంటారని అనిల్ సింగ్ చెప్పారు. తన తల్లి నవాబ్ మాలిక్ కు ఒక భూమిని ఇచ్చిందని ఆమె సొంత కుమారుడే ఒక స్టేట్మెంట్ లో చెప్పారని గుర్తు చేశారు. హసీనా పార్కర్ కు నవాబ్ మాలిక్ డబ్బులు ఇస్తుండటాన్ని తాను చూశానని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారని కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే నవాబ్ మాలిక్ అమాయకుడు కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని…ఆయనకు హసీనాతో లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాలిక్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు.