మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా కాళిదాస్ కోలంబకర్

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 12:11 PM IST
మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా కాళిదాస్ కోలంబకర్

Updated On : November 26, 2019 / 12:11 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబకర్ నియమితులయ్యారు. మంగళవారం (నవంబర్ 26, 2019) రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కాళీదాసును ప్రొటెం స్వీకర్ గా నియమించారు. గవర్నర్ ప్రతిపాదించిన అభ్యర్థుల్లో వాడాలా ఎమ్మెల్యే కోలంబకర్ ఒకరు.

ఈయన వాడాలా నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఈ రోజు రాజ్ భవన్‌లో అసెంబ్లీ ప్రొటెం స్వీకర్ గా కోలంబకర్ తో గవర్నర్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు (బుధవారం) ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సభ సమయంలో ప్రొటెం స్వీకర్ గా కోలంబకర్ ఎన్నికైన మిగతా 287 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాజభవన్ నుంచి ఓ అధికారి తెలిపారు. 

అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు బలపరీక్ష కోసం ప్రొటెం స్వీకర్‌ను నియమించాలని గవర్నర్ కు సుప్రీంకోర్టు ఇదే రోజున సూచించింది. బుధవారం సభలో జరుగబోయే బలపరీక్షలో ప్రొటెం స్వీకర్.. ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. బలపరీక్షకు ఒక రోజు ముందుగానే అనూహ్య పరిణామాలతో సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒకేరోజు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.