మహా రాజకీయం : బీజేపీ ఏం చేయనుంది

క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ... తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం

  • Published By: veegamteam ,Published On : November 25, 2019 / 02:18 AM IST
మహా రాజకీయం : బీజేపీ ఏం చేయనుంది

Updated On : November 25, 2019 / 2:18 AM IST

క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ… తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం

క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ… తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ పంపిన ఆహ్వానానికి రుజువు చూపగలదా.. ఫడ్నవీస్ గవర్నర్‌కి ఇచ్చిన ఎమ్మెల్యేల మద్దతు పత్రాలు సమర్పించగలరా.. ఒక వేళ సమర్పించకపోతే ఏం జరుగుతుంది అనేది ఇపుడు హాట్‌ టాపిక్‌ గామారింది.

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం బలపరీక్ష కంటే ముందే మరో పరీక్ష ఎదుర్కోనుంది. సర్కార్‌ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సోమవారం ఉదయం 10.30కు విచారణ జరపనున్న కోర్టు… ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన లేఖతోపాటు… బీజేపీ సంఖ్యా బలం లేఖను పరిశీలించనుంది. ఆ తర్వాత బలపరీక్షపై నిర్ణయం తీసుకోనుంది. దీంతో మహారాష్ట్రలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.

అయితే బీజేపీ ఏమని వాదించబోతోందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇందుకోసం ఫఢ్నవీస్ ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించగా… ఆదివారం(నవంబర్ 24,2019) అర్ధరాత్రి సమయంలో సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ కూడా చర్చలు జరిపారు. కోర్టు విచారణ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం కోర్టు తీర్పు తమ కూటమికే అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేస్తోంది.

నవంబర్ 30వరకూ గవర్నర్ కోష్యారీ… దేవేంద్ర ఫడ్నవీస్‌కి అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు గడువిచ్చినా… సుప్రీంకోర్టు తీర్పు భిన్నంగా ఉంటే.. ఫడ్నవీస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. ఎందుకంటే… అజిత్‌పవార్ వెంట వచ్చిన వారిలో ఇప్పటికే మెజార్టీ సభ్యులు మళ్లీ శరద్‌పవార్‌ గూటికి చేరారు. 

మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 288. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. కానీ.. ఫడ్నవీస్ క్యాంప్‌లో ప్రస్తుతం అంతమంది ఎమ్మెల్యేలు లేనట్లు తెలుస్తోంది. అందుకే.. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకునేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నుంచి ఆకర్షించడానికి బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా.. ఎన్సీపీ నుంచి వచ్చిన అజిత్‌ పవార్‌, ఆయన వర్గంలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఎంఎన్‌ఎస్‌ నుంచి ఒక ఎమ్మెల్యే, మరో ఇద్దరు ఇతర ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నప్పటికీ మొత్తం సంఖ్య 120ని దాటడం లేదు. అంటే.. మరో 25మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కితే తప్ప ఫడ్నవీస్ ప్రభుత్వం పడిపోకుండా ఆపే పరిస్థితిలేదన్న టాక్ వినిపిస్తోంది.

అయితే.. బీజేపీ తన సర్కార్‌ను నిలబెట్టుకునేందుకు ఆపరేషన్ కమలం చేపట్టిందని…  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమిలోని ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించారని కూడా పొలిటికల్ టాక్. ముఖ్యంగా మొన్నటివరకు మిత్రపక్షంగా కొనసాగిన శివసేనను టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఓవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ చేపట్టిందన్న వార్తలతో క్యాంపు రాజకీయాలు కంటిన్యూ అవుతున్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో తలమునకలయ్యాయి. నిన్నటి వరకు హోటల్ రినాయిసెన్స్‌లో తమ ఎమ్మెల్యేలను ఉంచిన ఎన్సీపీ.. వారిని  వేరేచోటికి తరలించింది. శివసేన తన 56 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ జారిపోకుండా..లలిత్ హోటల్‌లో ఉంచింది. ఇటు కాంగ్రెస్ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలను జేడబ్ల్యూ మారియట్‌లో ఉంచింది. అయితే… అదే హోటల్‌లో బీజేపీ నాయకులు గదులను బుక్‌ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతోంది. మొత్తంగా… తాజా పరిణామాల మధ్య ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠ రేపుతోంది.