Maha Covid-19 Cases: మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం.. మార్చి 10 నుంచి ఇదే మొదటిసారి!
మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పట్టింది. భారీగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. శనివారం (జూన్ 5) కొత్తగా 13,659 కరోనా కేసులు నమోదయ్యాయి.

Maha Covid 19 Cases
Maharashtra COVID-19 cases : మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పట్టింది. భారీగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. శనివారం (జూన్ 5) కొత్తగా 13,659 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 300 మంది మరణించారు. మార్చి 10 నుంచి అత్యల్పంగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 58,19,224 కు చేరగా. మరణాల సంఖ్య 99,512 కు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
వరుసగా ఆరవ రోజు శనివారం రాష్ట్రంలో 20వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. మార్చి 10న, రాష్ట్రంలో ఇదే సంఖ్యలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. గత మరణాలతో పక్షం రోజులకు పైగా రోజువారీ ప్రాతిపదికన మరణాల సంఖ్య 700కు పైగా పెరుగుతోంది. అంతకుముందు నమోదు చేయని మరణాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇక కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 55,28,834 కు పెరిగింది. అలాగే 21,776 మంది రోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోలుకున్న కేసుల సంఖ్య 55,28,834 కు పెరిగాయి. 21,776 మంది రోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పుడు మహాలో 1,88,027 యాక్టివ్ COVID-19 కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు ఒక రోజు క్రితం 94.86 శాతం నుంచి 95.01 శాతానికి మెరుగుపడింది. ఇక మరణాల రేటు 1.71 శాతంగా ఉంది. మహారాష్ట్రలో శనివారం 2,40,088 మందిని కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు పరిశీలించిన శాంపిల్స్ సంఖ్య 3,62,71,483 గా ఉంది. హోం క్వారంటైన్ లో ఉన్నవారిలో 14,00,052 మంది ఉండగా, 7,093 మంది సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో నమోదైన 300 మరణాలలో 211 చివరి 48 గంటల్లో, గత వారంలో 89 మంది మరణించారు.
గత వారానికి ముందు నమోదైన 1,088 మరణాలు గణాంకాలలో చేర్చారు. ముంబైలో కొత్తగా 863 కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. నాసిక్ విభాగంలో 1,379 కేసులు నమోదయ్యాయి. ఇందులో 38 మరణాలు అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్నాయి. పూనే డివిజన్‌లో 3,442 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,348 సతారా జిల్లాలో ఉన్నాయి. ఇందులో 54 మంది మరణించారు.
వారిలో 18 మంది పూణే గ్రామీణ ప్రాంతాల్లో 10 మంది పూణే నగరంలో మరణించారు. సతారా జిల్లాలో మరో 17 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర COVID-19 గణాంకాల్లో 58,19,224 పాజిటివ్ కేసులు, కొత్త కేసులు 13,659, మరణాల సంఖ్య 99,512, రికవరీ 55,28,834, యాక్టివ్ కేసులు 1,88,027, కరోనా పరీక్షలు 3,62,71,483 నిర్వహించారు.