Srivari Temple Mumbai : ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం..టీటీడీకి భూమి పత్రాలిచ్చిన మ‌హారాష్ట్ర మంత్రి

నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్ర‌భుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆదిత్య ఠాక్రే టీటీడీకి అందజేశారు.

Srivari Temple Mumbai : ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం..టీటీడీకి భూమి పత్రాలిచ్చిన మ‌హారాష్ట్ర మంత్రి

Mubai Srivari

Updated On : April 30, 2022 / 12:37 PM IST

Srivari Temple Mumbai : మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు న‌వీ మంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ‌ భూమి పత్రాలను మ‌హారాష్ట్ర మంత్రి టీటీడీకి అందించారు. అయితే ముంబైలో శ్రీ‌వారి ఆలయాన్ని నిర్మించడానికి రేమండ్ సంస్థ‌ ముందుకు వ‌చ్చింది.

నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్ర‌భుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆదిత్య ఠాక్రే టీటీడీకి అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం(ఏప్రిల్ 30,2022) ఉద‌యం టీటీడీ బోర్డు మీటింగ్‌ ప్రారంభానికి ముందు చైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర మంత్రి పత్రాలను అందించారు.

Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీటీడీ

రేమండ్ గ్రూప్ చైర్మన్ మరియు ఎండి శ్రీ గౌతమ్ సింఘానియా తరపున, రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ సరిన్ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ ఆదిత్య ఠాక్రే, శ్రీ సంజీవ్ సారిన్‌లను టీటీడీ చైర్మన్ సత్కరించారు.

నవీ ముంబయిలోని ఉల్వేలో 10 ఎకరాల భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చినందుకు రేమండ్ గ్రూప్ చైర్మన్‌కు శ్రీ గౌతమ్ సింఘానియాకు టీటీడీ చైర్మ‌న్ కృతజ్ఞతలు తెలిపారు.