సుస్థిర పాలన కోసమే చేతులు కలిపాం : డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 

  • Published By: chvmurthy ,Published On : November 23, 2019 / 03:21 AM IST
సుస్థిర పాలన కోసమే చేతులు కలిపాం : డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 

Updated On : November 23, 2019 / 3:21 AM IST

మహా రాష్ట్రలో కాంగ్రెస్ శివసేన లకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది.  ఎన్సీపీ తో కలిసి శనివారం ఉదయం ప్రభుత్వాన్పి ఏర్పాటు చేసింది.  సీఎం గా దేవంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా…డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ భగత్‌సింగ్‌ కోశ్యారీ వారిచే ప్రమాణం చేయించారు.

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కోసమే తాము బీజేపీకి మద్దతు ఇచ్చామని మహారాష్ట్ర డిప్యూటీ  సీఎం అజిత్ పవార్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ… మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని, భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అందువల్లే తాము బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అజిత్ పవార్ చెప్పారు.

Also Read  : బ్రేకింగ్ : మహారాష్ట్ర సీఎం గా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం