PMO దండగ..గడ్కరీకి కరోనా కట్టడి బాధ్యతలు అప్పగించాలి

క‌రోనా నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌లు మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి అప్పగించాలంటూ బీజేపీ ఫైర్‌బ్రాండ్ సుబ్ర‌మ‌ణ్య‌న్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

PMO దండగ..గడ్కరీకి కరోనా కట్టడి బాధ్యతలు అప్పగించాలి

Make Nitin Gadkari In Charge Of Covid 19 Battle Relying On Pmo Useless Subramanian Swamy Suggests Pm Narendra Modi

Updated On : May 5, 2021 / 3:42 PM IST

Nitin Gadkari క‌రోనా నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌లు మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి అప్పగించాలంటూ బీజేపీ ఫైర్‌బ్రాండ్ సుబ్ర‌మ‌ణ్య‌న్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్థన్ కు పూర్తి స్వేచ్ఛ లేదంటూ స్వామి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఉదయం స్వామి వరుస ట్వీట్ లు చేశారు.

ఇస్తామిక్ చొర‌బాటుదారులు, బ్రిటీష్ సామ్రాజ్య‌వాదుల‌ను ఎదురించి నిలిచిన‌ట్లే ఇండియా క‌రోనా మ‌హ‌మ్మారిపై కూడా విజ‌యం సాధిస్తుంది. ఇప్పుడే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే పిల్ల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకునే మ‌రో క‌రోనా వేవ్‌ను మ‌నం చూడాల్సి వ‌స్తుంది. అందుకే మోడీ ఈ క‌రోనాపై పోరు బాధ్య‌త‌ల‌ను వెంట‌నే గ‌డ్క‌రీకి అప్ప‌గించాలి. పీఎంవోపై ఆధార‌ప‌డ‌టం దండ‌గ అని స్వామి ట్వీట్ చేశారు.

అయితే,తాను ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యాన్ని విమ‌ర్శిస్తున్నానే త‌ప్ప ప్ర‌ధాన‌మంత్రిని కాద‌ని ఓ నెటిజన్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు స్వామి. ముందు ఆరోగ్య మంత్రిని తీసేయాల‌ని ఓ వ్య‌క్తి చేసిన సూచ‌న‌పైనా స్వామి మ‌రో ట్వీట్‌లో స్పందించారు. లేదు లేదు హ‌ర్భ‌వ‌ర్ద‌న్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వ‌లేదు. ఆయ‌న‌కు అధికారం చెలాయించలేక‌పోతున్నారు. గ‌డ్క‌రీతో క‌లిస్తే ఆయ‌న విజ‌య‌వంత‌మ‌వుతారు అని స్వామి స్ప‌ష్టం చేశారు. దేశ‌ం కొవిడ్ సెకండ్ వేవ్‌తో, ఆక్సిజ‌న్‌, మందుల కొర‌త‌తో అల్లాడుతున్న స‌మ‌యంలో స్వామి ఈ కీల‌క వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.