Gold Sweets : బంగారు మిఠాయిలు…కేజీ ధర ఎంతో తెలుసా?

బంగారు మిఠాయిలను మీరెప్పుడైనా చూశారా..? ధన త్రయోదశి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతిలో ఓ మిఠాయి దుకాణం ‘సువర్ణ కలశ్‌’ పేరుతో మిఠాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Gold Sweets : బంగారు మిఠాయిలు…కేజీ ధర ఎంతో తెలుసా?

Gold Sweets

Updated On : November 2, 2021 / 12:13 PM IST

Gold Sweets in maharastra : బంగారు మిఠాయిలను మీరెప్పుడైనా చూశారా..? మహారాష్ట్ర బంగారు మిఠాయిలు తయారు చేశారు. ధన త్రయోదశి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతిలో ఓ మిఠాయి దుకాణం ‘సువర్ణ కలశ్‌’ పేరుతో మిఠాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో మిఠాయి తయారు చేయడం విశేషం.

మొత్తం 12 కేజీల ‘సువర్ణ కలశ్‌’ మిఠాయి తయారు చేసినట్లు రఘువీర్‌ మిఠాయి దుకాణం నిర్వాహకుడు తేజస్‌ పోపత్‌ తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్‌ నుంచి నిపుణుల్ని రప్పించినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం నాటికి ఏడు కేజీల మిఠాయిలు విక్రయాలు పూర్తయ్యాయని చెప్పారు.

Petrol, Diesel Prices : ఆరని పెట్రో మంట..మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

కరోనా కారణంగా గతేడాది ఈ ప్రత్యేక మిఠాయిని తయారు చేయలేదని వెల్లడించారు. ఇంతకీ ఇంటిల్లిపాదీ కలిసి ఓ కేజీ ‘సువర్ణ కలశ్‌’తో నోరు తీపి చేసుకోవాలంటే మాత్రం రూ.11,000 వెచ్చించాల్సి ఉంటుంది. బంగారు మిఠాయి కాబట్టి.. అందుకే అంత ధర పలుకుంది.