Malayalam Nurses: క్షమాపణ చెప్పాల్సిందే అంటోన్న మళయాళీ నర్సులు

Malayali Nurses
Malayalam Nurses: ఢిల్లీ హాస్పిటల్ ఇష్యూ చేసిన మళయాళం మాట్లాడకూడదనే ఆర్డర్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మళయాళీ నర్సుల యూనియన్ రాతపూర్వకమైన క్షమాపణ చెప్పాలంటూ.. అంతేకాకుండా ఇలా చేసిన వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ డిమాంట్ చేశారు.
జూన్ 5న ఢిల్లీ గోవింద్ బల్లాబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నర్సులకు ఓ ఆర్డర్ చేసింది. వారు మాట్లాడుకోవాలంటే కేవలం ఇంగ్లీషు లేదా హిందీ మాత్రమే వినియోగించాలని మళయాళంలో మాట్లాడుకోవద్దని తెలిపింది. ఒకరోజు తర్వాత ఆర్డర్ వెనక్కు తీసేసుకుంది.
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కు గానీ, ఢిల్లీ గవర్నమెంట్ కు గానీ తెలియకుండానే ఇది జరిగిందని చెప్పుకొచ్చింది. ఢిల్లీ యాక్షన్ కమిటీకు చెందిన మళయాళీ నర్సులు ఈ సర్క్యూలర్ భాషా స్వేచ్ఛను హరించే విధంగా ఉందని వాపోతున్నారు.
ఇది నిజంగా మాకు షాకింగ్ గా అనిపిస్తుంది. మా భాషాపరమైన స్వేచ్ఛకు ప్రమాదంగా ఉంది. ఈ ఆదేశం ఇచ్చిన వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిందే’ అంటూ డిమాండ్ చేస్తున్నారు.