తొండం ఎత్తి థ్యాంక్స్ చెప్పిన ఏనుగు.. హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో

Viral Video: దాన్ని చూసిన తల్లి ఏనుగు ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటకు తీసుకురాలేకపోయింది.

తొండం ఎత్తి థ్యాంక్స్ చెప్పిన ఏనుగు.. హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో

Elephant

అటవీశాఖ సిబ్బందికి తొండం ఎత్తి థ్యాంక్స్ చెప్పింది ఓ ఏనుగు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఐఎస్ అధికారిణి సుప్రియా సాహూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. గున్న ఏనుగుల పట్ల తల్లి ఏనుగులు చాలా శ్రద్ధ వహిస్తాయి.

తమ గున్న ఏనుగులకు ప్రమాదం తలెత్తకుండా రక్షించుకుంటాయి. తాజాగా, తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలో ఓ గున్నఏనుగు ఓ కాలువలో పడిపోయింది. దాన్ని చూసిన తల్లి ఏనుగు ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటకు తీసుకురాలేకపోయింది.

ఈ విషయాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు కాల్వలో పడిన గున్న ఏనుగును రక్షించారు. ఆ తర్వాత ఆ గున్న ఏనుగు తన తల్లితో కలిసి వెళ్లిపోయింది. ఆ సమయంలో తల్లి ఏనుగు అటవీ అధికారులకు థ్యాంక్స్ చెబుతూ తన తొండాన్ని ఎత్తింది. ఏఐఎస్ అధికారిణి సుప్రియా సాహూ పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అటవీశాఖ అధికారులు గున్న ఏనుగును కాపాడడం పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read Also: కార్తీక దీపం సీక్వెల్ ప్రోమో చూశారా.. త్వరలో సీరియల్ మళ్ళీ మొదలు..