Mamata Banerjee : కన్నీళ్లు పెట్టుకున్న దీదీ

సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నిర్వహించే పరీక్షలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.

Mamata Banerjee : కన్నీళ్లు పెట్టుకున్న దీదీ

Mamata (1)

Updated On : August 12, 2021 / 8:49 PM IST

Mamata Banerjee సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నిర్వహించే పరీక్షలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అడగమన్న ప్రశ్నలే యూపీఎస్‌సీ అడుగుతోందని, ఈ చర్యలు దాని పునాదిని బలహీనపరుస్తున్నాయని మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు గురువారం ప్రకటించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా దీదీ కన్నీటిపర్యంతమయ్యారు. తమ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు బీజేపీ తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ దీదీ కంటతడిపెట్టారు. యూపీఎస్‌సీ నిష్పక్షపాతంగా ఉండేదని, కానీ ప్రస్తుతం బీజేపీ తాను అడగాలనుకున్న ప్రశ్నలను యూపీఎస్‌సీ బోర్డు చేత అడిగిస్తుందని మమత ఆరోపించారు. అలానే యూపీఎస్‌సీ పేపర్‌లో రైతుల నిరసనపై ప్రశ్న కూడా రాజకీయ ప్రేరేపితమే అని మమతా బెనర్జీ విమర్శించారు. యూపీఎస్‌సీ వంటి సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందని మమత ఆరోపించారు. యూపీఎస్సీ వంటి సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు.

కాగా, వెస్ట్ బెంగాల్ పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చేలరేగిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ కావాలనే తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి వారిపై దాడులు చేయించారని బీజేపీ ఆరోపించగా…అధికార తృణముల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఫేక్‌ వీడియోలు, ఫోటోలతో జనాలను బీజేపీ మోసం చేస్తుందని టీఎంసీ పేర్కొంది.