Mamata Banerjee: నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్న మమత… కొత్త ఫ్రంట్ కోసమేనా?
వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలు కొత్త కూటముల కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రహిత, కాంగ్రెస్ రహిత కూటమి కోసం ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు.

Mamata Banerjee: సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలు కొత్త కూటముల కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రహిత, కాంగ్రెస్ రహిత కూటమి కోసం ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి.
London: లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్
దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. భువనేశ్వర్‌లో నవీన్ పట్నాయక్‌తో మమత గురువారం ఉదయం సమావేశమవుతారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటు కోసమే వీరి భేటీ జరగబోతుందని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్, బీజేపీలు లేని రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని మమత ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా కొద్ది రోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీలకు తాము సమాంతర దూరం పాటిస్తామని ఇద్దరూ ప్రకటించారు. ఈ కూటమికి మమత నాయకత్వం వహించాలనుకుంటున్నారు.
Mukesh Ambani: ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీని దాటేసిన అంబానీ.. టాప్-10లో నిలిచిన ముకేష్ అంబానీ
అందుకే మమత అందరితో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా నవీన్ పట్నాయక్‌తో భేటీ అవుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు లేకుండా కలిసి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రతిపక్షాల ఫ్రంట్ గురించి తాము ఇప్పటివరకు చర్చించలేదని నవీన్ పట్నాయక్ అన్నారు. ప్రస్తుతం మమత ఒడిశా పర్యటనలోనే ఉన్నారు. బుధవారం పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించి, హారతి ఇచ్చారు. కొత్త ఫ్రంట్ కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రయత్నిస్తున్నారు.