ప్రేయసితో కరోనా ప్రియుడు పరార్..చివరిలో ట్విస్ట్

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 03:57 AM IST
ప్రేయసితో కరోనా ప్రియుడు పరార్..చివరిలో ట్విస్ట్

Updated On : March 28, 2020 / 3:57 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కానీ..వైరస్ తమను భయపెట్ట లేదని ఓ ప్రేమజంట అంటోంది. ప్రేయసి కోసం విదేశాల నుంచి వచ్చి..పోలీసులకు చిక్కాడు. ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఇతను..అందరీ కళ్లుగప్పి పరార్ అయ్యాడు. చివరకు ప్రేయసిని చేరుకున్నాడు. వీరిద్దరూ పరారయ్యారు. పోలీసులను ముచ్చెమటలు పట్టించిన ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. 

శివగంగైకు చెందిన విజయ్ విదేశాల్లో ఉంటున్నాడు. మధురై ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తూ వచ్చారు. విదేశాల నుంచి రాగానే పెళ్లి చేసుకుందామని విజయ్ చెప్పాడు. కానీ ఈ క్రమంలోనే..యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం విజయ్ తెలుసుకున్నాడు. వెంటనే మధురైకి రావాలని డిసైడ్ అయ్యాడు. ఈ సమయంలోనే కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. 

ఎట్టకేలకు మధురై చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో ఇతనికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఇతడిని మధురై లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాధి ఉందా ? లేదా ? తెలుసుకొనేందుకు రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించారు.

ఇది ఇలా కొనసాగుతుంటే..అతను మాత్రం తన ప్రేయసిని దక్కించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. చివరకు 2020, మార్చి 26వ తేదీ గురువారం రాత్రి పరార్ అయ్యాడు. తిరుపరంగుండ్రంలో ప్రేయసి ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లాడు. తర్వాత..వీరిద్దరూ పరార్ అయ్యారు. 

ఆసుపత్రిలో వైద్యులు పరిశీలిస్తుండగా..విజయ్ కనిపించలేదు. ఆందోళన చెందిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అతని కోసం గాలించడం మొదలు పెట్టారు. కుమార్తె కూడా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు విజయ్ పై అనుమానం కలిగింది.

ఆగ్రహంతో అతని తల్లి, సోదరుడిపై దాడి చేసి గాయపరిచారు. చివరకు విజయ్ ఎక్కడున్నారో పోలీసులు గుర్తించారు. శివగంగై కు వెళుతున్న వీరిని పట్టుకున్నారు. యువతికి కూడా కరోనా సోకిందా ? లేదా ? అనేది తెలుసుకోవడానికి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇతడిని పట్టుకోవడానికి పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది.