housing crisis : అద్దె ఇంటి కోసం ఐపీఎల్ మ్యాచ్‌ని వదల్లేదుగా.. బెంగళూరులో ఓ వ్యక్తి ఏం చేసాడో చూడండి

బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అద్దె ఇళ్ల వెతుకులాటలో జనం పడుతున్న కష్టాలు వింటూనే ఉన్నాం. తాజాగా అద్దె ఇంటి కోసం ఓ వ్యక్తి ఏం చేశాడో చదివితే ఆశ్చర్యపోతారు. ఇక అతని మెచ్చుకోకుండా కూడా ఉండలేరు.

housing crisis : అద్దె ఇంటి కోసం ఐపీఎల్ మ్యాచ్‌ని వదల్లేదుగా.. బెంగళూరులో ఓ వ్యక్తి ఏం చేసాడో చూడండి

housing crisis

Updated On : April 17, 2023 / 4:08 PM IST

housing crisis : ఎవడి గోల వాడిది అన్నట్లు ఉంది బెంగళూరులో (Bengaluru) పరిస్థితి.. ఓవైపు RCB IPL మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతోంది. మ్యాచ్ చూడటానికి వచ్చిన వ్యక్తి తనకు అద్దెకు ఇల్లు కావాలని ప్ల‌కార్డ్ (placard) చూపించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

police harassed the woman : మహిళను వేధించిన బెంగళూరు పోలీస్ .. సోషల్ మీడియాలో తన సమస్య చెప్పుకున్న మహిళ

బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఇక అద్దె ఇళ్లకోసం జనం పడుతున్న పాట్లు రకరకాల వార్తలుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని ఐపీఎల్ మ్యాచ్ వరకూ తీసుకువెళ్లాడు ఓ వ్యక్తి. ఓ వైపు మ్యాచ్ జరుగుతుంటే ఇతను స్టేడియంలో నిలబడి ఇందిరా‌నగర్‌లో (indiranagar) తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు అద్దెకు కావాలని ప్లకార్డు పట్టుకుని నిలబడ్డాడు. ఈ సందర్భంలో తీసిన ఫోటోని అతిన్ బోస్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

rented room like a prison : జైలు గది కాదు నమ్మండి.. బెంగళూరులో అద్దె ఇల్లు ఫోటో వైరల్

బెంగళూరులో అద్దె ఇంటి వెతుకులాటలో చాలామందిలో క్రియేటివిటీ బయటకు వస్తోంది. రకరకాలుగా తమ టాలెంట్ ఉపయోగించి అద్దె ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మ్యాచ్ జరిగే ప్రాంతాన్ని తనకు అద్దె ఇల్లు చూపించే వేదికగా మలుచుకోవడంలో ఆ వ్యక్తి ఆలోచనను జనాలు మెచ్చుకుంటున్నారు. మీకు ఖచ్చితంగా త్వరలో అద్దె ఇల్లు దొరుకుతుందని కొందరు.. మీ ఐడియా సూపర్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇలాంటి వార్తలు చదువుతుంటే బెంగళూరు లాంటి నగరాల్లో అద్దె ఇల్లు దొరకడానికి జనం పడుతున్న పాట్లు మామూలుగా లేవని అర్ధం అవుతోంది.