Punjab : కూతురిని చంపి, మృతదేహాన్ని బైక్ కు కట్టుకుని ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై విసిరేసిన తండ్రి

బైక్ కు కూతురు మృతదేహాన్ని కట్టుకుని రోడ్డుపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Punjab : కూతురిని చంపి, మృతదేహాన్ని బైక్ కు కట్టుకుని ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై విసిరేసిన తండ్రి

Man kill daughter

Updated On : August 11, 2023 / 10:12 PM IST

Man Killed Daughter In Punjab : పంజాబ్ లో ఘోరం జరిగింది. కన్నతండ్రే కూతురిని కడతేర్చాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే కూతురిని దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని బైక్ కట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి రైల్వే ట్రాక్ పై విసిరేశాడు. ఈ ఘటన అమృత్ సర్ జిల్లాలో చోటు చేసుకుంది.

జంధియాలా పట్టణంలోని ముచ్చల్ లో బావూ అనే వ్యక్తికి తన 19 ఏళ్ల కూతురి ప్రవర్తనపై
అనుమానం వచ్చింది. దీంతో తన ఇంట్లోనే అతను కూతురిని అత్యంత కిరాతంగా చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్ కు కట్టుకుని రోడ్డుపై ఈడ్చు కెళ్లి రైల్వే పట్టాలపై విసిరి వేశాడు.

Amit Shah : రాజద్రోహం చట్టం లేదు ఇకపై దేశ ద్రోహం మాత్రమే.. కొత్త చట్టాలే వర్తిస్తాయి : అమిత్ షా

బైక్ కు కూతురు మృతదేహాన్ని కట్టుకుని రోడ్డుపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు.