Man-Donkey : సహనానికి కూడా ఓ హద్దుంటుందిరా ‘గాడిద’..యజమానికి చుక్కలు చూపించిందిగా..
నాలుగు గోడల మధ్య పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది అంటారు పెద్దలు.అదే నిజమైంది ఓ గాడిద విషయంలో.

Man Slaps And Kicks Donkey Repeatedly
Man slaps and kicks donkey repeatedly : నాలుగు గోడల మధ్య పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది అంటారు పెద్దలు.నిజమే తనను తాను కాపాడుకోవటానికి పిల్లి పులిలా మారి తిరగబడుతుంది.అందుకే సాధు జంతువుల గురించి తక్కువ అంచనా వేయకూడదు. ఇవేం చేస్తాయిలే అని వాటిపై ఇష్టమొచ్చినట్లుగా దాడి చేసినా..హింసించినా చుక్కలు చూపించటం ఖాయం..చావు తప్పి కన్ను లొట్టబోవటం పక్కా. అదే నిజమైంది ఓ గాడిద విషయంలో. ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్న యజమాని పెట్టే చిత్రహింసల్ని భరించీ భరించీ ఆ గాడిదకు సహనం నశించిపోయింది. అదను చూసి యజమానికి చుక్కలు చూపించింది ఓ గాడిద. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏమైందో కానీ..ఓ యజమాని తన గాడిదపై ప్రతాపం చూపించాడు. దాన్ని ఇష్టమొచ్చినట్లుగా కొట్లాడు. కొడుతూ.. కాలితో ముఖాన్ని తన్నడం మొదలు పెట్టాడు. పాపం అయినా ఆ గాడిద యజమాని కొట్టే దెబ్బల్ని మౌనంగా భరించింది. గాడిదే కదా ఏం చేస్తుందిలేనని అనుకున్న ఆ యజమానిని ఈడ్చి ఈడ్చిపారేసింది. చూశావా..నువ్వే కాదు నేను తలచుకుంటే ఏమైనా చేయగలను అని నిరూపించింది. అవకాశం కోసం ఎదురు చూసి యజమానికి చుక్కలు చూపించింది.
అప్పటివరకు గాడిదను కొట్టి ఆ తరువాత అదే గాడిదపైకి ఎక్కి కూర్చుని స్వారీ చేయాలనుకున్నాడు. అంతే..వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలను కున్న ఆ గాడిద తనదైన శైలిలో యజమానిని ఈడ్చి ఈడ్చిపారేసింది. ఇంక ‘నాకు టైమ్ వచ్చిందినుకున్న’ గాడిద.. యజమానికి చుక్కలు చూపించింది. అతడ్ని కిందకు పడేసి, అతడి కాలిని నోటితో కరుచుకుని గిరగిరా గుండ్రంగా నేలపై ఈడ్చేసింది. ఈ వీడియో చూస్తే దేనికైనా ఓ హద్దు ఉంటుందని అనుకోక మానరు.ఈ వీడియోను బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా, వైరల్ అవుతోంది. కర్మ ఫలితం అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram