యువకుడిపై ఖాకీ కావరం : నేలపై పడేసి..బూటు కాళ్లతో చితక్కొట్టారు

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 05:57 AM IST
యువకుడిపై ఖాకీ కావరం : నేలపై పడేసి..బూటు కాళ్లతో చితక్కొట్టారు

Updated On : September 13, 2019 / 5:57 AM IST

కొత్త ట్రాఫిక్ చట్టం అమలు వచ్చాక ప్రజలు జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అంతేకాదు ట్రాఫిక్ నిబంధల విషయంలో కొంతమంది పోలీసులు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలతో పోలీసులు ఫ్లెండ్లీగా వ్యవహరిస్తుంటే కొంతమంది పోలీసులు మాత్రం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు.  ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్‌ నగర్‌ జిల్లాలో గురువారం (సెప్టెంబర్ 12)న చోటుచేసుకుంది. 

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడంటూ..ఇద్దరు పోలీసులు రింకూ పాండే అనే యువకుడుని ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. ఓ బాలుడితో కలిసి బైక్ పై వెళ్తున్న పాండేను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరేంద్ర మిశ్రా, హెడ్‌ కానిస్టేబుల్‌ మహేంద్ర ప్రసాద్‌ అతన్ని ఆపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తో పాటు బైక్‌కు సంబంధించిన పేపర్స్ చూపించమని అడిగారు. ఈ క్రమంలో సదరు యువకుడికి.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.దీంతో అహం దెబ్బతిన్న పోలీసులు మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ..చెలరేగిపోయారు. అతడ్ని ఇష్టమొచ్చినట్లుగా చితక్కొట్టారు.నేలపై  బూటు కాళ్లతో తన్నారు. 

అంతే కాదు..ఓ పోలీసు పాండేపై కూర్చొని హింసించాడు. తాను చేసింది తప్పే..దానికి నన్ను జైల్లో వేయండి..కొట్టొద్దు అంటు పాండే వేడుకున్నాడు. మొర పెట్టుకున్నాడు. అయినా పోలీసులు కనికరించలేదు. బైక్ తాళాలు తీసేసుకుని పొమ్మన్నారు.తాను నిబంధలను ఉల్లంఘిస్తే..కేసు పెట్టండి..ఫైన్ వేయండి..అంతగా అయితే జైలులో వేయండి..అంతే గానీ ఇలా కొట్టటమేంటని ప్రశ్నించాడు. పాండేను పోలీసులు హింసిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇదికాస్తా ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు యువకుడిని చితకబాదిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు.