వామ్మో.. 12వ ఫ్లోర్ నుంచి కిందకు దూకేయబోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
నోయిడాలోని సూపర్ టెక్ కేప్ టౌన్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.

Viral Video (Photo Credit : Google)
Viral Video : ఉత్తరప్రదేశ్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. 12వ ఫ్లోర్ నుంచి కిందకు దూకేందుకు రెడీ అయిపోయాడు. ఇంతలో ఇది గమనించిన పొరుగింటి వారు.. వెంటనే అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నోయిడాలోని సూపర్ టెక్ కేప్ టౌన్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఆ సొసైటీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన జాబ్ కోల్పోయాడు. దీంతో అతడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆత్మహత్య చేసుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అంతే, 12వ ఫ్లోర్ నుంచి కిందకు దూకేందుకు రెడీ అయ్యాడు.
అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న వాళ్లు ఇది గమనించారు. ఆ వ్యక్తి కిందకు దూకడానికి రెడీగా ఉండటాన్ని గమనించి షాక్ తిన్నారు. కొందరు మహిళలు గట్టి గట్టిగా కేకలు వేశారు. కిందకు దూకొద్దని అరిచారు. ఇద్దరు వ్యక్తులు పరుగున వెళ్లారు. కిందకు దూకడానికి రెడీగా ఉన్న వ్యక్తిని.. ఒకతను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి అతడి కాళ్లు పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి అతడిని పైకి లాగేశారు. దీంతో ఘోరం తప్పినట్లైంది.
ఆత్మహత్య చేసుకోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేయడం, ఇంతలో చుట్టుపక్కల వాళ్లు వచ్చి కాపాడటం.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఒళ్లు జలదరించేలా ఉంది. కాగా, ఆ వ్యక్తి చేసిన పనిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. సమస్యలకు చావు పరిష్కారం కాదని అంటున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం పిరికితనం అన్నారు. జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు కామన్ అని.. వాటిని ఫేస్ చేసి ముందుకు సాగడమే లైఫ్ అని అంటున్నారు.
नोएडा, यूपी की सुपरटेक केपटाउन सोसाइटी में एक शख्स ने 12वीं मंजिल से कूदने का प्रयास किया। कुछ लोगों ने ऐन वक्त पहुंचकर उसको बचाया।
कहा जा रहा है कि ये युवक इस सोसाइटी में किराए पर रहता है। नौकरी चली गई। इस वजह से डिप्रेशन में आ गया और सुसाइड करना चाहता था। pic.twitter.com/Gvi6cUgMFi
— Sachin Gupta (@SachinGuptaUP) October 21, 2024
Also Read : దారుణం.. చైన్ కోసం మహిళను ఎలా ఈడ్చుకెళ్లారో చూడండి.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో..