Rare Tortoises Smuggling : అరుదైన తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Rare Tortoises Smuggling : అరుదైన తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

rare tortoises smuggling

Updated On : December 13, 2022 / 3:23 PM IST

Rare Tortoises Smuggling : కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన వారు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బంగారం, డ్రగ్సే కాకుండా అరుదైన జాతులకు చెందిన జీవులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు.

Drugs Smuggling : డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం.. ఇండియా మీదుగా స్మగ్లింగ్..
ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి అరుదైన జాతికి చెందిన 20 నక్షత్ర తాబేళ్లను సీజ్ చేశారు. వాటి విలువ దాదాపు రూ.3.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.