మండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : July 6, 2020 / 09:09 PM IST
మండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్

Updated On : July 6, 2020 / 9:27 PM IST

ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్​బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు.

శనివారం నుంచి తలనొప్పి, గొంతు గరగర లాంటి లక్షణాలు కనిపించాయి. నియోజకవర్గం పర్యటన సందర్భంగా నాకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నా. వైద్య పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నేను మా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటున్నాను. నాకు రోగనిరోధక శక్తి బాగానే ఉంది. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని బలంగా నమ్ముతున్నాను. నేను ఇప్పటి వరకు ఎవరిరెవరితో కలిసానో.. వారందరి వివరాలు అధికారులకు చెప్పాను. అలాగే నన్ను కలిసిన వారందరూ… దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను అని సుమలత తెలిపారు.

భర్త అంబరీశ్​ మరణాంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, 2019 లోక్ సభ ఎన్నికల్లో మండ్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి అప్పటి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై సుమలత ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సుమలత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నటించారు.