బీజేపీ ద్వేష రాజకీయం చేసింది..పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : February 11, 2020 / 10:24 AM IST
బీజేపీ ద్వేష రాజకీయం చేసింది..పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు

Updated On : February 11, 2020 / 10:24 AM IST

ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్ విజయం ఖారారైంది. ఢిల్లీలో ప్రబుత్వ ఏర్పాటుకు 36మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండగా,మొత్తం 70స్థానాల్లో ఆప్ 63స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో సంబరాలు చేసుకుంటున్నారు. లగేరహో కేజ్రీవాల్ అంటూ డ్యాన్స్ లు వేస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు,నాయకులు కేజ్రీవాల్ కు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు.

బీజేపీ ద్వేషపు రాజకీయాలకు ప్రయత్నించిందని,కానీ ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆప్ లీడర్ మనీష్ సీసోడియా అన్నారు. పత్ పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి సిసోడియా విజయం సాధించారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పత్ పర్ గంజ్ లో సిసోడియా విజయానికి ముందు అనేక ట్విస్ట్ లు నెలకొన్నాయి.ఒకదశలో సిసోడియ ఓడిపోతున్నట్లు కన్పించింది. బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి సిసోడియాకు గట్టి పోటీ ఇచ్చారు. నెక్ టు నెక్ ఫైట్ లో చివరికి సిసోడియా 2వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.

మరోవైపు ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ప్రాంతం షాహీన్ బాగ్,జామియా యూనివర్శిటీ. ఓక్లా అసెంబ్లీ పరిధిలోకి షాహీన్ బాగ్,జామియా యూనివర్శిటీ ఏరియాలు వస్తాయి. ఇక్కడ ఆప్ విజయం దాదాపు ఖరారైంది. ఓక్లా ఆప్ అభ్యర్థి అమానతుల్ల ఖాన్ మాట్లాడుతూ…అమిత్ షాకు ఓక్లా నియోజకవర్గ ప్రజలు కరెంట్ షాక్ ఇచ్చారని అన్నారు.కామ్ కీ రంజీతీ అంటూ ఆప్ విజయంపై కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. విన్ ఫర్ భారత్ మాతా అని ఆయన ట్వీట్ లో తెలిపారు.