Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..
శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.

Bharat Bandh: మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరు మీద లేఖను విడుదల చేశారు. 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపింది.
శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. 2 నెలలుగా మేం సంయమనం పాటించామని మావోయిస్టు కేంద్ర కమిటీ తెలిపింది. కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
Also Read: జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ అప్‌డేట్ వరకు.. 5 ముఖ్యమైన మార్పులివే..!
* జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది అమరవీరుల స్మారక సమావేశాలను నిర్వహించాలని పిలుపు.
* ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా దాదాపు 85 మంది కామ్రేడ్స్ హత్యకు గురయ్యారు.
* ఏప్రిల్ 21న జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మా కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ (ప్రయాగ్ మాంఝీ) హత్యకు గురయ్యారు.
* ఏప్రిల్ 24 నుండి మే 8 వరకు కర్రెగుట్టలో 31 మంది కామ్రేడ్లు హత్యకు గురయ్యారు.