Uttar Pradesh : అత్తగారు సిగరెట్ కాలుస్తూ డ్యాన్స్ చేసిందని ఆగిపోయిన పెళ్లి
పెళ్లిలో అత్తగారు సిగరెట్ కాలుస్తూ డ్యాన్స్ చేసిందని ఒకచోట వరుడు పెళ్లి ఆపేశాడు. మరోచోట అల్లుడికి సిగరెట్ అందిస్తూ అత్తగారు స్వాగతిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇవేం సంప్రదాయాలు బాబోయ్ అంటూ జనం షాకవుతున్నారు.

Uttar Pradesh
Uttar Pradesh : ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో చిత్ర విచిత్రమైన సంప్రదాయాలు అమలు చేస్తున్నారు. వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ పెళ్లి ఆగిపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అత్తగారు DJ పాటలకు సిగరెట్ కాలుస్తూ డ్యాన్స్ చేసిందని పెళ్లి ఆగిపోయింది.
karanataka : పెళ్లి కావడం లేదని యువకుడి ఆవేదన.. ‘కన్య భాగ్య పథకం’ ప్రవేశ పెట్టమంటూ అధికారులకు లేఖ
సరయాత్రిన్‌కు చెందిన యువకుడికి రాజ్‌పురాకు చెందిన అమ్మాయికి పెళ్లి ఏర్పాట్లు చేశారు. వివాహానికి ముందు జరగాల్సిన తంతు బాగానే చేశారు. ఇక పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. ఓవైపు అతిథులు భోజనం చేస్తున్నారు. మరోవైపు అందరూ సంబరంగా నృత్యం చేస్తున్నారు. ఈ వేడుకల మధ్య వధువు తల్లి సిగరెట్ ఊదుతూ డ్యాన్స్ చేస్తుండటం వరుడి కంట పడింది. వెంటనే షాకయ్యాడు. వెంటనే పెళ్లి నిలిపివేయాలని కుటుంబసభ్యులకు చెప్పాడు. అంతే రెండు కుటుంబాల మధ్య తీవ్రస్ధాయిలో గొడవ జరిగింది. చివరికి పెళ్లి రద్దు చేశారు. అయితే కుటుంబీకుల మధ్య పంచాయితీ జరిగింది. సంఘ సభ్యులు కలగజేసుకుని మధ్యవర్తిత్వం చేయడంతో రెండు కుటుంబాలు వివాహానికి తిరిగి అంగీకరించాయి. మొత్తానికి ఆగిపోయిన పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో అందరూ సంతోషించారు.
Funny Tweet : పెళ్లికి పిలిచినట్లా? పిలవనట్లా? మీకూ.. డౌట్ వస్తుంది
అత్తగారు సిగరెట్ కాల్చడమే ఈ పెళ్లి వేడుకలో సమస్య తీసుకురాగా.. మరో వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అత్తగారు సిగరెట్‌తో వరుడినిన స్వాగతిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అత్తమామలు అల్లుడిని ఈ విధంగా ఆహ్వానించడం చూసి జనం షాకవుతున్నారు. ఈ సంప్రదాయాలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram