Fire Broke Out : ఒడిశాలో రెండు చోట్ల భారీ అగ్ని ప్రమాదం

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకున్నారు. భవనం మూడో అంతస్థులో మంటలను అదుపు చేయడంతోపాటు గన్నీ గోడౌన్‌లో మంటలను కూడా అదుపు చేశారు.

Fire Broke Out : ఒడిశాలో రెండు చోట్ల భారీ అగ్ని ప్రమాదం

fire broke out in odisha

Updated On : November 13, 2023 / 10:31 AM IST

Odisha Fire Broke Out : ఒడిశాలో రెండు చోట్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంబల్‌పూర్ నగరంలోని ఖేత్‌రాజ్‌పూర్ ప్రాంతంలో రెండు చోట్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గన్నీ గోడౌన్‌లో ఒక అగ్ని ప్రమాదం జరగగా, నివాస భవనంలోని మూడో అంతస్తులో మరో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకున్నారు. భవనం మూడో అంతస్థులో మంటలను అదుపు చేయడంతోపాటు గన్నీ గోడౌన్‌లో మంటలను కూడా అదుపు చేశారు.

రెండు అగ్ని ప్రమాదాల్లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అగ్నిమాపక సహాయకుడు చెప్పారు. సంబల్‌పూర్‌లోని అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ బిస్వాల్ మీడియాతో మట్లాడుతూ నివాహ భననం మూడవ అంతస్తు, గన్నీ గోడౌన్‌లో మంటలు చెలరేగాయని రాత్రి 10.30 గంటలకు సమాచారం వచ్చిందన్నారు. ఘటనస్థలాలకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారని తెలిపారు. ఎవరికి గాయాలు కాలేదని చెప్పారు.

Man Sets Wine Shop On Fire : మద్యం ఇవ్వలేదని వైన్ షాష్ కు నిప్పంటించిన వ్యక్తి

ఆదివారం దేశంలోని పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని వస్నా స్వామినారాయణ్ పార్క్ ఓపెన్ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వాస్నా ప్రాంతంలోని స్వామినారాయణ్ పార్క్ ఓపెన్ గ్రౌండ్‌లో వ్యర్థాలు, చెత్తకు మంటలు అంటుకున్నాయని అహ్మదాబాద్‌లోని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఇనాయత్ షేక్ మీడియాకు తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
కాగా, ముంబైలోని కుర్లాలోని నెహ్రూ నగర్‌లోని అభ్యుదయ బ్యాంక్ భవనంలో మంటలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని సేథ్ శ్రీలాల్ మార్కెట్‌లోని రెండు వస్త్ర దుకాణాలు ఆదివారం రాత్రి అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

Fire Breaks Out : గుజరాత్‌ అహ్మదాబాద్‌లో అగ్ని ప్రమాదం

అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
సేథ్ శ్రీలాల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఖోకోన్ భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ దీపావళి రోజున రెండు వస్త్ర దుకాణాలు పూర్తిగా దగ్ధం కావడం చాలా దురదృష్టకరం అన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రాకుంటే పెద్ద ప్రమాదం జరిగేదన్నారు. వారు రావడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు.