Gold Prices : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి కొనుగోలుదార్లకు తీపి కుబురు. పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 820 మేర తగ్గి రూ.47,840 వద్దకు చేరింది.

Gold Prices : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver

Updated On : August 8, 2021 / 8:51 AM IST

reduced gold and silver prices : బంగారం, వెండి కొనుగోలుదార్లకు తీపి కుబురు. పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. శనివారం పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 820 మేర తగ్గి రూ.47,840 వద్దకు చేరింది. నిన్న ఈ ధర రూ.48,660గా ఉంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.750 తగ్గుదలతో రూ. 44,600 నుంచి రూ.43,850కు దిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందన్న గణాంకాలు వెలువడుతుండటంతో అక్కడి కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ త్వరితంగా వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు పసిడి పతనానికి దారితీసింది.

అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక పెట్టుబడిగా కొనుగోలు చేసిన బంగారాన్ని శుక్రవారం రాత్రి మదుపరులు జోరుగా విక్రయించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 45 డాలర్లు పడిపోయి 1,763 డాలర్ల స్థాయికి తగ్గింది. ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ ఇండియాలో కూడా బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం రాత్రి మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ట్రేడ్ అ య్యే 10 గ్రాముల బంగారం ఫ్యూచర్‌ ధర రూ.960 క్షీణించి రూ.46,660 వద్ద ముగిసింది.

జూన్‌-జూలై నెలల్లో అంతర్జాతీయంగా బంగారం ధరకు మద్దతునిస్తున్న 1,780 డాలర్ల స్థాయిని కోల్పోవడంతో రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గవచ్చని, ఎంసీఎక్స్‌లో ఈ ధర రూ.45,800 వరకూ తగ్గవచ్చని అంచనా. గతేడాది ఆగస్టులో రూ.56,000 రికార్డు స్థాయికి చేరిన బంగారం, ఈ ఏడాదిలో రూ.9,000 మేర తగ్గింది.

వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,500 వరకూ పడిపోయింది. శుక్రవారం రూ.71,700గా ఉన్న కిలో వెండి శనివారం రూ.70,200కు తగ్గింది. ప్రపంచ మార్కెట్ లో ఔన్సు వెండి ధర 3.8 శాతం తగ్గి 24.33 డాలర్లకు చేరింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌లో కిలో వెండి ఫ్యూచర్‌ కాంట్రాక్టు రూ.2,023కు పడిపోయి, రూ.64,975 వద్ద ముగిసింది.