Mayawati: ముస్లిం రిజర్వేషన్లపై మీ నిజాయితీని నిరూపించుకోండి.. ప్రభుత్వాలకు మాయావతి సూచన
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు అవసరమనే

Muslim Reservation: ముస్లిం వర్గంలో వెనుకబడిన ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వారి అభ్యున్నతికి పక్కాగా రిజర్వేషన్లు అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి డిమాండ్ చేశారు. ముస్లిం సమాజంలో 80 శాతం ‘పాశ్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురైన’ ప్రజలే ఉన్నారని భోపాల్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాల్ని ఆమె గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా నిరుపేద ముస్లింల కోసం రిజర్వేషన్లను అమలు చేయాలని అన్ని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది ‘పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న’ ప్రజలేనని భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు అవసరమనే చేదు వాస్తవాన్ని అంగీకరించే ఆవశ్యకత ఉందని ఆ ప్రకటనను బట్టి తెలుస్తోంది. కాబట్టి వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్‌ను వ్యతిరేకించకుండా బీజేపీని నిలదీయడంతో పాటు తమ ప్రభుత్వాలన్నీ నిజాయితీగా రిజర్వేషన్‌ను అమలు చేసి, వెనుకబడిన ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉంది’’ అని ట్వీట్ చేశారు.