CBI Raids: మూడు-నాలుగు రోజుల్లో నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా

కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) లేదా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను మూడు-నాలుగు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా అన్నారు. మద్యం పాలసీలో అవకతవకల కేసులో నిన్న ఢిల్లీలోని ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తాను దేనికీ భయపడబోమని చెప్పారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని అన్నారు.

CBI Raids: మూడు-నాలుగు రోజుల్లో నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా

CBI Raids

Updated On : August 20, 2022 / 1:11 PM IST

CBI Raids: కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) లేదా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను మూడు-నాలుగు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా అన్నారు. మద్యం పాలసీలో అవకతవకల కేసులో నిన్న ఢిల్లీలోని ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తాను దేనికీ భయపడబోమని చెప్పారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని అన్నారు.

ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకల అంశం బీజేపీకి సమస్యే కాదని, అరవింద్ కేజ్రీవాల్ ను మాత్రమే బీజేపీ సమస్యగా చూస్తోందని సిసోడియా చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రాభవాన్ని అడ్డుకోవడానికే తనపై చర్యలు తీసుకుంటున్నారని, తన నివాసం, కార్యాలయాల్లో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ అవినీతికీ పాల్పడలేదని చెప్పారు. ఢిల్లీలో మద్యం పాలసీ అత్యుత్తమమైందని చెప్పుకొచ్చారు. కాగా, తాను సీబీఐ విచారణకు సహకరిస్తానని ఇప్పటికే పలుసార్లు మనీశ్ సిసోడియా చెప్పారు. అయితే, తాము అమాయకులమని నిరూపించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆప్ నేతలు అసత్యాలు చెబుతున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

China-taiwan conflict: తైవాన్‌లో అస్థిరత తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దు: అమెరికా వార్నింగ్