wife thrashes husband : ప్రియురాలికి గిఫ్టులు కొనిచ్చిన భర్త..నడిరోడ్డుపై కాలర్ పట్టుకుని ఉతికిపారేసిన భార్య

wife thrashes husband : ప్రియురాలికి గిఫ్టులు కొనిచ్చిన భర్త..నడిరోడ్డుపై కాలర్ పట్టుకుని ఉతికిపారేసిన భార్య

Meerut Woman Thrashes Husband In Public

Updated On : March 17, 2021 / 11:03 AM IST

Meerut woman thrashes husband in public : బంగారంలాంటి భార్యను పెట్టుకుని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్తలను భార్యలు ఉతికి ఆరేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. వివాహాతర సంబంధాలు పెరుగుతున్న క్రమంలో ఇటువంటివి సర్వసాధారణంగా మారిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో ఓ భార్య తనకు తెలియకుండా ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ..ఆమెకు గిఫ్టులు..డ్రెస్సులు కొనిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆపై కోపం తీరేదాకా నడిరోడ్డుమీదే ఉతికి ఆరేసిన ఘటన మీటర్ లో జరిగింది.

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో మంగళవారం (మార్చి 16,2021) మధ్యాహ్నం ఓ భార్య భర్తను ఎడా పెడా వాయించేసిన ఘటనతో స్థానికులు బిత్తరపోయారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మీరట్ లోని శాస్త్రి నగర్ సెంట్రల్ మార్కెట్ వద్ద గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న భర్తను భార్య పట్టుకుంది. కానీ ప్రియుడి భార్య అక్కడకు వచ్చిందనే గుర్తించి ప్రియురాలు మాత్రం అక్కడనుంచి వెంటనే ఎస్కేప్ అయ్యింది. కానీ భర్త మాత్రం భార్య చేతికి చిక్కాడు. అంతే షర్టు పట్టుకుని ఎటా పెడా వాయించి పారేసింది…అడ్డంగా బుక్ అయిపోయానని ఆ భర్త ఏం చేయలేక వెర్రిమొహం వేసుకుని ఉండిపోయాడు..

మీరట్ కు చెందిన అద్నాన్, ఆయేషాలకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కానీ వాడికి పరాయి యువతిపై మోజు పెంచుకున్నాడు. భార్యను పట్టించుకోవటం మానేశాడు. పైగా భార్యను తరచూ కొడుతుండేవాడు. దీంతో భర్త చేతిలో దెబ్బలు తినీ తినీ ఆమె సహనం నశించిపోయింది. ఎవరితోనే వివాహేతన సంబంధం నడిపిస్తున్నాడని ఆనోటా ఈ నోటా తెలుసుకున్న ఆయేషా భర్తపై ఓ కన్నేసి ఉంచింది. ఈక్రమంలో మార్కెట్ కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన భర్త వెనకాలే వెళ్లింది.

అలా భర్తకు అనుమానం రాకుండా వెనుకే మార్కెట్ వరకు వెళ్లిన ఆయేషా.. అతడు మరో మహిళ కోసం షాపింగ్ చేస్తున్నాడని తెలుసుకుంది. భర్త, అతడి ప్రియురాలు షాప్ నుంచి బయటికి రాగానే… అద్నాన్‌ను అక్కడిక్కడే నడిరోడ్డుపై రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వాళ్లను విడదీశారు.

అప్పటికే అద్నాన్ ప్రియురాలు అక్కడి నుంచి పారిపోవడంతో.. అయేషా, అద్నాన్‌లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా తాను ఆయేషాకు ఎప్పుడో విడాకులు ఇచ్చానంటూ అద్నాన్ చెబుతున్నాడు. దానికి సంబంధించి తగిన ఆధారాలు మాత్రం పోలీసులకు చూపించలేకపోయాడు. కానీ తమకు వివాహం అయి కేవలం సంవత్సరం మాత్రమే అయ్యిందని ఆయేషా చెబుతోంది. వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే భర్త తననుతరచూ కొడుతున్నాడని వాపోయింది.

దీంతో కాదు కాదు..తన భార్యే తనను చంపటానికి యత్నిస్తోందని చెప్పుకొస్తున్నాడు అద్నాన్. ఇవన్నీ తనను వదిలించుకోవటానికి అతను చెప్పే కట్టుకథలు మాత్రమేననీ ఆయేషా అంటోంది. వీరిద్దరి గొడవపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అద్నాన్ పై గృహ హింస కేసు పెట్టి విచారణ చేపట్టారు.