Meghalaya CM Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా
మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ కె. సంగ్మా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్.. సంగ్మా చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Meghalaya CM
Meghalaya CM Conrad Sangma: మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ కె. సంగ్మా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్.. సంగ్మా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సంగ్మాతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఎన్పీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏడుగురు, యూడీసీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరంతా ప్రమాణ స్వీకారం చేశారు.
Meghalaya: మేఘాలయలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గ వివరాలు వెల్లడించిన సంగ్మా
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తదితరులు హాజరయ్యారు. ఇదిలాఉంటే సంగ్మాతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ప్రెస్టోన్ త్సాంసాంగ్, ఎస్. ధర్లు ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో.. అలెగ్జాండర్ లలూ హెక్, డాక్టర్ అంపరీన్ లింగ్డో, పాల్ లింగ్డో, కమింగోన్ యంబోన్, షక్లర్ వార్గర్, అబు తహెర్ మోండల్, కిరమేన్ షాయలా, ఎంఎన్ మారక్, రక్కమ్ ఎ సంగ్మా ఉన్నారు.
Nagaland: నాగాలాండ్‌లో ప్రతిపక్షం లేని ప్రభుత్వం.. అన్నిపార్టీలు మద్దతిచ్చాయి..!
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్పీపీ 26 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజార్టీ లేకపోవటంతో బీజేపీ, యూడీపీ వంటి మిత్రపక్షాలతో కలిసి సీఎంగా వరుసగా రెండోసారి సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. నాగాలాండ్‌లోనూ నేడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎంగా నెప్యూ రియో నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రేపు త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టానున్నారు.