మేఘాలయ హనీమూన్ కేసు.. రాజా రఘువంశీ మరణానికి కొన్ని నిమిషాల ముందు వీడియో వైరల్.. ఆ సమయంలో వారు ఎక్కడున్నారంటే..
దేవ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో రఘువంశీ, సోనమ్ కొండపైకి ఎక్కుతున్నట్లుగా ఉంది.

Meghalaya Honeymoon Case
Meghalaya Honeymoon Case: పెళ్లిజరిగిన కొద్దిరోజులకు భార్యతో కలిసి మేఘాలయకు హనీమూన్ వెళ్లిన రాజా రఘువంశీ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా అతని భార్య సోనమ్ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. సోనమ్‌తో పాటు.. మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.. అయితే, తాజాగా.. రాజా రఘువంశీ – సోనమ్ హనీమూన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో రఘువంశీ చనిపోయడానికి కొన్ని నిమిషాల ముందు తీసిన వీడియోగా భావిస్తున్నారు.
వీడియో ఎవరు తీశారు..
రాజా రఘువంశీ, సోనమ్ మేఘాలయకు హనీమూన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జికి వెళ్లిన సమయంలో దేవ్ సింగ్ అనే పర్యాటకుడు సోనమ్, రఘువంశీ కొండపైకి వెళ్తున్న వీడియోను తీశాడు. అతను తాజాగా.. వీడియోను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే 23వ తేదీ ఉదయం 9.45గంటల సమయంలో ఈ వీడియో తీసినట్లు పేర్కొన్నాడు.
కొత్త వీడియోలో ఏముందంటే..?
దేవ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో రఘువంశీ, సోనమ్ కొండపైకి ఎక్కుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో గురించి దేవ్ సింగ్ తన ఇన్‌స్టాలో ఈలా రాశాడు.. ‘‘నేను 2025 మే 23న మేఘాలయ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జికి ప్రయాణించాను. ఆ సమయంలో ఈ వీడియోను రికార్డ్ చేశాను. నిన్న నేను వీడియోలను తనిఖీ చేస్తున్నప్పుడు, ఇండోర్ జంట రికార్డింగ్ నాకు దొరికింది. ఆరోజు ఉదయం 9:45 గంటల ప్రాంతంలో మేము నోగ్రియాట్ గ్రామంలో రాత్రి బస చేసిన తర్వాత కిందకు వెళ్తున్నాము. రఘువంశీ, సోనమ్ జంట పైకి వెళ్తున్నారు. ఇది ఆ జంట యొక్క చివరి వీడియో అని నేను అనుకుంటున్నాను. సోనమ్ రాజా దగ్గర దొరికిన అదే తెల్ల చొక్కా ధరించింది. ఇది మేఘాలయ పోలీసులకు వారి విచారణలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.’’ అని దేవ్ సింగ్ రాశాడు.
మే 23న రాజా రఘువంశీ వీసాడోంగ్ జలపాతం సమీపంలో హత్యకు గురయ్యాడు. జూన్ 2న అతడి మృతదేహం ఒక కాలువలో పోలీసులు గుర్తించారు.
View this post on Instagram