మేఘాలయ ‘హనీమూన్’ కేసులో బిగ్ ట్విస్ట్.. సోనమ్‌కు 200సార్లు కాల్స్ చేసిన సంజయ్‌వర్మ దొరికేశాడు.. అతడు ఎవరంటే..?
మధ్యప్రదేశ్ లోని మీరట్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే, ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Sonam with boyfriend Raj Kushwaha
Honeymoon Case: మధ్యప్రదేశ్ లోని మీరట్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లిజరిగిన కొద్దిరోజులకు భార్య సోనమ్ తో కలిసి రాజా రఘువంశీ మేఘాలకు హనీమూన్ కు వెళ్లగా.. ప్రియుడుతో కలిసి సోనమ్ సుఫారీ ఇచ్చి భర్తను హత్యచేయించింది. హత్యజరిగిన కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహంను పోలీసులు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా మృతుడు భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో సహా సుపారీ తీసుకొని హత్యచేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, సోనమ్‌కు వివాహానికి ముందు.. తరువాత సంజయ్ వర్మ పేరుతో 200కుపైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆ సంజయ్ వర్మ ఎవరనే అంశం ఈ కేసులో చర్చనీయాంశమైంది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200కుపైగా సార్లు ఫోన్ కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సంజయ్ వర్మ ఎవరు..? సోనమ్ తో సంజయ్ వర్మకు సంబంధం ఏమిటనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సంజయ్ వర్మ మరెవరో కాదు.. సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని పోలీసులు తేల్చారు.
సోనమ్ తన ఫోన్‌లో ప్రియుడు రాజ్ కుష్వాహా పేరును సంజయ్ వర్మ పేరుతో సేవ్ చేసుకుంది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్ పెళ్లికి ముందు.. పెళ్లి తరువాత వీరు 239సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని పోలీసులు గుర్తించారు. అయితే, సంజయ్ మొబైల్ నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.