Mi-17V5 Chopper Crash : బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ భద్రతపై అనుమానాలు!

బుధవారం మధ్యాహ్నాం తమిళనాడులోని కూనూర్ వద్ద భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రయాణిస్తున్న Mi-17V5 హెలికాప్టర్​ కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్​ లో

Mi-17V5 Chopper Crash : బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ భద్రతపై అనుమానాలు!

C

Mi-17V5 Chopper Crash :  బుధవారం మధ్యాహ్నాం తమిళనాడులోని కూనూర్ వద్ద భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రయాణిస్తున్న Mi-17V5 హెలికాప్టర్​ కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్​ లో ప్రయాణిస్తున్న త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్,ఆయన భార్యతో కలిపి 13మంది మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ 90 శాతం గాయాలతో వెల్లింగ్టన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

బిపిన్ రావత్ ప్రయాణించింన ఎంఐ-17వీ5 హెలికాప్టర్​ రష్యాకు చెందిన సంస్థ తయారు చేసింది.సైనిక బలగాల రవాణా, రక్షణ వంటి కీలక ఆపరేషన్లలో దీన్ని వినియోగిస్తారు. నెలరోజుల వ్యవధిలోనే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. దీంతో ఈ చాపర్ భద్రతపై ఇప్పుడు చర్చ మొదలైంది.

MI-8i పాత వర్షన్‌ను.. MI-17గా అభివృద్ధి చేశారు. ఈ హెలికాప్టర్ భారత ఆర్మీలో చాలా ప్రత్యేకమైంది. Mi-17V5 అనేది భారత వైమానిక దళం ఉపయోగించే ఆధునిక రవాణా హెలికాప్టర్. ర‌ష్య‌న్ హెలిక్యాప్టర్స్‌కు చెందిన స‌బ్సిడ‌రీ అయిన క‌జాన్ హెలికాప్ట‌ర్స్ దీనిని త‌యారుచేసింది. వీటిని భ‌ద్ర‌తాబ‌లాగాల ర‌వాణా, ఆయుధ రవాణా, అగ్నిప్ర‌మాదాల క‌ట్ట‌డితోపాటు కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్ విధుల్లో, గాలింపు, ర‌క్ష‌ణ ఆప‌రేష‌న్‌ల‌లో వినియోగిస్తున్నారు.

Mi-17V5 సిరీస్‌ మిలిటరీ హెలికాప్టర్.. అత్యంత శక్తివంతమైన, సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. అందుకే వీవీఐపీల పర్యటనలకు దీన్నే వినియోగిస్తున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలకు ఈ చాపర్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉన్నాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్‌ సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉంటుంది. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది అత్యధికంగా గంటకు 250కిలోమీటర్ల వేగంతో 580కిలోమీటర్లు ప్రయాణించగలదు. 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం చేయగలదు. గరిష్టంగా 13,000 కిలోల టేకాఫ్ బరువును మోసుకెళ్లగలిగే సామర్ధ్యం దీనికి ఉంది. అత్యాధునిక ఏవియానిక్స్‌ కలిగి ఉండటంతో ఏ వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా తయారు చేశారు. ఒకేసారి 36 మందిని లేదా 4.5టన్నుల లోడ్‌ను తరలించగలదు. పారా కమాండోలను జారవిడిచే సామర్థ్యం కలిగి ఉంది.

రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్‌పోర్ట్ 2008లో భారత ప్రభుత్వంతో 80 Mi-17V5 హెలికాప్టర్‌లను పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 17 ఫిబ్రవరి 2012న భారత వైమానిక దళంలోకి చేర్చబడింది. ఒప్పందం ప్రక్రియ 2013లో పూర్తయింది. 2013 ప్రారంభం వ‌ర‌కు మొత్తం 36 హెలికాప్ట‌ర్‌ల‌ను డెలివ‌రీ చేసింది. భారత వైమానిక దళం కోసం 71… Mi-17V5 హెలికాప్టర్‌ల డెలివరీ కోసం కొత్త ఒప్పందాలు కుదిరాయి. 2012, 2013 మ‌ధ్యకాలంలో 71.. ఎంఐ-17వీ5 హెలికాప్టర్ల కోసం భార‌త ర‌క్షణ శాఖ‌, రొసొబ‌రో నెక్స్‌పోర్ట్ మ‌ధ్య అంగీకారం కుదింది. ఈ రొసొబ‌రో నెక్స్‌పోర్ట్.. ఆఖ‌రి బ్యాచ్ ఎంఐ-17వీ5 హెలికాప్టర్లను 2018 జూలైలో డెలివ‌రీ చేసింది. ఈ ఎంఐ-17వీ5 హెలికాప్టర్​ల రిపేర్ అండ్ స‌ర్వీసింగ్ సౌక‌ర్యాన్ని భార‌త వాయుసేన 2019 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆర్మీలో ప్రస్తుతం 151 ఎంఐ 17 హెలికాప్టర్‌లు ఉన్నాయి.

గతనెల 19న అరుణాచల్ ప్రదేశ్​లో ఈ సిరీస్‌ చాపర్‌ కూలింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు.

ALSO READ RIP General Bipin Rawat :హెలికాఫ్టర్ ప్రమాదానికి ముందు..ప్రమాదం తర్వాత అసలు జరిగిందిదే

ALSO READ Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..

ALSO READ Army Chopper Crash : హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి