వాటే ఎస్కేప్ : మహిళపై దూసుకెళ్లిన వ్యాన్.. సేఫ్

సూరత్ : కొన్ని కొన్ని సంఘటనలు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం నుండి మిరాకిల్ గా బైటపడింది ఓ మహిళ.

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 09:23 AM IST
వాటే ఎస్కేప్ : మహిళపై దూసుకెళ్లిన వ్యాన్.. సేఫ్

సూరత్ : కొన్ని కొన్ని సంఘటనలు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం నుండి మిరాకిల్ గా బైటపడింది ఓ మహిళ.

సూరత్ : కొన్ని కొన్ని సంఘటనలు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం నుండి మిరాకిల్ గా బైటపడింది ఓ మహిళ. దేవుడికి దణ్ణం పెట్టుకుంటుండగా..ఆమెపైనుండి వెళ్లిపోయింది ఓ మినీవ్యాన్. అయినా ఆమెకు చిన్నపాటి దెబ్బకూడా తగలకపోవటం విశేషం. 
 
చెత్తను తరలించే మినీ వ్యాన్ మీది నుంచి దూసుకెళ్లినా.. సూరత్‌కు చెందిన 55 ఏళ్ల ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. జనవరి 6న సూరత్‌లో ఉదానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుడి ముందు రోడ్డు మీద నిలబడిన మహిళ.. చెప్పులు విప్పి చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంది. ఈలోగా మున్సిపాలిటీకి చెందిన మినీ వ్యాన్ రివర్స్ చేసుకుంటూ వచ్చి ఢీకొట్టి, ఆమె మీదుగా వెళ్లింది.

ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రమాదం నుండి బైటపడిని ఆమెను సూరత్‌కు చెందిన 55 ఏళ్ల రమీలా సోలంకిగా గుర్తించారు. జనవరి 6 ఉదయాన గుడి ముందు రోడ్డు మీద నిలబడి.. చెప్పులు విప్పి దేవుడికి దండం పెట్టుకుంటోంది. ఈలోగా మున్సిపాలిటీ వ్యాన్ రివర్స్ చేసుకుంటూ వచ్చి ఢీకొట్టి..ఆమె మీదుగా వెళ్లింది. అయినా ఆమెకు ఏ ప్రమాదం జరిగలేదు. దీంతో ఆ మహిళ తాను దణ్ణం పెట్టుకున్న సాయిబాబే తనను రక్షించాడని మురిసిపోతోంది.