Lady Constable : మహిళ కానిస్టేబుల్ పై అత్యాచారం.. వీడియో తీసి

బర్త్ డే పార్టీకి పిలిచి కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు.. సెప్టెంబర్ మొదట్లో ఈ దారుణం జరగ్గా బాధితురాలు సెప్టెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Lady Constable : మహిళ కానిస్టేబుల్ పై అత్యాచారం.. వీడియో తీసి

Lady Constable

Updated On : September 25, 2021 / 4:22 PM IST

Lady Constable : బర్త్ డే పార్టీకి పిలిచి కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో జరిగింది. సెప్టెంబర్ మొదట్లో ఈ దారుణం జరగ్గా బాధితురాలు సెప్టెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే ఇండోర్‌ లో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ కు పేస్ బుక్ ద్వారా పవన్ లోహర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిరువురు చాలా కాలంగా పేస్ బుక్ లో చాట్ చేసుకుంటున్నారు. ఇక గత ఏప్రిల్ నుంచి వీరు వాట్సాప్ ద్వారా చాట్ చేస్తున్నారు. ఈ నెల మొదల్లో తన సోదరుడి పుట్టినరోజు ఉండటంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ పార్టీకి కానిస్టేబుల్ ని కూడా ఆహ్వానించారు.

Read More  : Love Story : ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ‘లవ్ స్టోరీ’..

ఇక బర్త్ డే పార్టీ అయిపోయిన తర్వాత పవన్ లోహర్, ధీరేంద్ర లోహర్, విజయ్ లోహర్ లు కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. బయట ఎక్కడైనా చెబితే వీడియోలు బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన కానిస్టేబుల్ ఎవరికి చెప్పుకోలేకపోయింది. అయితే అత్యాచారం చేసిన వ్యక్తుల బంధువు తరచూ కానిస్టేబుల్ కి ఫోన్ చేస్తూ విసిగించాడు. లక్ష రూపాయలు ఇవ్వాలని లేదని వీడియోలు బయటపెట్టడమని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై 376, 376 బి మరియు 506 కేసులు నమోదు చేశారు.

Read More : TTD : నకిలీ వెబ్‌‌సైట్, ఆన్‌లైన్ గేమ్ తయారీపై టీటీడీ సీరియస్