కూతుర్ని పరువు హత్య చేశారని తండ్రి, కొడుకును జైళ్లో పెట్టారు.. ఏడాదిన్నర తర్వాత అదే మహిళ తిరిగొచ్చింది

కూతుర్ని పరువు హత్య చేశారని తండ్రి, కొడుకును జైళ్లో పెట్టారు.. ఏడాదిన్నర తర్వాత అదే మహిళ తిరిగొచ్చింది

Updated On : August 11, 2020 / 11:51 AM IST

సంవత్సరన్నర కాలంపాటు కనిపించకుండాపోయిన మహిళ తండ్రి, సోదరుడు జైళ్లో ఉండగా తిరిగొచ్చింది. ఇది బాగానే ఉంది కదా అనుకోవడానికి లేదు. వాళ్లు జైలుకెళ్లింది ఆ మహిళ మర్డర్ కేసులోనే. అమ్రోహ పోలీసులు తండ్రి సురేశ్, సోదరుడు రూప్ కిషోర్, మరొక కుటుంబ సభ్యుడు దినేశ్ ను పరువు హత్య చేశారంటూ డిసెంబర్ 2019లో జైళ్లో పెట్టారు. మిస్సింగ్ కేసు చేధించలేక నిందితులు వాడారంటూ ఓ దేశీవాలీ పిస్టల్, మిస్ అయిన యువతి దుస్తులు తీసుకువచ్చి కేస్ క్లోజ్ చేశారు.



ఆ ముగ్గురు కుటుంబ సభ్యులు కనిపించడం లేదని మహిళే గ్రామానికి వచ్చింది. ఇల్లు వదిలివెళ్లిన తర్వాత ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లుగా చెప్పింది. కేసుపై ఇన్వెస్టిగేషన్ చేసిన SHOను ప్రస్తుతం సస్పెండ్ చేసి అతనిపై విచారణకు ఆదేశించారు.

అమ్రోహ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) విపిన్ తాడా ఇన్వెస్టిగేషన్ చేసి అశోక్ శర్మగా గుర్తించారు పోలీసులు. ఆ మహిళ హత్య కేసులో జైలుకు వెళ్లిన కుటుంబ సభ్యుల శిక్షను తప్పిస్తున్నట్లు.. జైలు నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు.



‘ఆ మహిళను కోర్టు ముందు హాజరుపరిచి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఆ వెంటనే ఎస్హెచ్ఓను డ్యూటీ నుంచి తప్పిస్తాం. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఈ కేసుపై విచారణ చేపట్టారు’ అని ఎస్పీ చెప్పారు.

రిపోర్టుల ప్రకారం.. మహిళ ఫిబ్రవరి 2019న ఇంట్లోంచి కనిపించకుండాపోయింది. కుటుంబ సభ్యులు ఆమె బాయ్ ఫ్రెండ్ తో వెళ్లినట్లుగా అనుమానించారు. కొద్ది నెలల పాటు విచారణ చేసి తండ్రిని, సోదరుడ్ని మరో కుటుంబ సభ్యుడ్ని అరెస్టు చేశారు పోలీసులు.



సోదరులలో ఒకరైన రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. ‘ ముందు దినేశ్ ను టార్చర్ చేసి హత్య చేసినట్లు ఒప్పించారు. ఆ తర్వాత మా ఫాదర్, బ్రదర్‌ను అదే వీడియో చూపించి నేరం చేసినట్లుగా చిత్రీకరించారు. యువతిని చంపినట్లుగా ఒప్పుకునేంత వరకూ వారిని కొట్టారు. కనిపించకుండాపోయిన యువతి డ్రెస్ అని చూపించింది కూడా ఆమెది కాదని అంటున్నాడు.