రజనీతో కమల్ భేటీ…తలైవా మద్దతిస్తారా?

రజనీతో కమల్ భేటీ…తలైవా మద్దతిస్తారా?

Updated On : February 20, 2021 / 5:55 PM IST

kamal haasan:తమిళ నాడులో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న సమయంలో ప్రముఖ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్​హాసన్ శనివారం సూపర్​స్టార్​ రజనీకాంత్​​తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

చెన్నై పోయస్ గార్డెన్ లోని రజనీ నివాసంలో ఆయనను కమల్ కలిశారు. ఇరువురూ అరగంటకు పైగా చర్చించుకున్నారు. అయితే వారి మధ్య అంత సమయం పాటు జరిగిన సమావేశంపై చర్చ మొదలైంది.

అయితే.. ఇది మర్యాదపూర్వక సమావేశమని, రాజకీయ పరమైనది కాదని కమల్​ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఏప్రిల్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ మద్దతు కోసమే కమల్ ఆయనను కలిసినట్లు సమాచారం.