Mobile marriage hall : ఈ మ్యారేజ్ హాలుని మడతపెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..

మడతపెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఓ మ్యారేజ్ హాల్ వీడియోను షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.

Mobile marriage hall : ఈ మ్యారేజ్ హాలుని మడతపెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..

Mobile marriage hall..Anand Mahindra Hails this Unique Marriage Hall In truck

Updated On : September 26, 2022 / 3:16 PM IST

Mobile marriage hall : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజికి అంశాలపై కూడా చక్కగా స్పందించే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ముఖ్యంగా టాలెంట్ ఎక్కడున్నా..ఏ రంగంలో ఉన్నాసరే చక్కగా స్పందిస్తారు ఆనంద్ మహీంద్రా. టాలెంట్ కు సబంధించిన వీడియోను షేర్ చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. అలా ఓ మొబైల్ మ్యారేజ్ హాల్ వీడియోను షేర్ చేశారు. అంతేకాదు కదిలే మ్యారేజ్ హాల్ క్రియేట్ చేసిన వ్యక్తిని కలవాలని ఉందంటూ తన ఆకాంక్షను వెల్లడించారు.ఆనంద్ మహీంద్రా ఓ పోస్టును గానీ, వీడియోను గానీ పంచుకున్నారంటే అది ఎంతో క్రియేటివిటీ అవుతుందో ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ వీడియో కూడా అంతే వైరల్ అవుతోంది.

ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ కు సంబంధించి ఓ షిప్పింగ్ కంటైనర్ ను ఫంక్షన్ హాలుగా మలిచారు. ఈ కంటైనర్ పొడవు 40 అడుగులు ఉంది. ఈ కంటైనర్ లో మడతపెట్టేసే మ్యారేజ్ హాలు ఉంది. మడత పెట్టేందుకు వీలుగా ఉన్న పార్టులను తెరిస్తే చక్కటి మ్యారేజ్ హాల్ ప్రత్యక్షమవుతుంది. 40 అడుగుల పొడుగున్న కంటైనర్ లో మడతలను తెరిస్తే 30 అడుగుల వరకు విస్తరిస్తుంది. దీంట్లో 200 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు.

దీని లోపల ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులకు చల్లదనం కోసం రెండు ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. నగరాల్లోని కల్యాణ వేదికలను తలపించేలా ఇది రిచ్ లుక్ తో కనిపిస్తోంది ఈ మొబైల్ మ్యారేజ్ హాల్. వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అంతరాయం లేకుండా ఫంక్షన్లు జరుపుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా ఈజీగా తరలించేయవచ్చు. ఈ మొబైల్ ఫంక్షన్ హాలు వీడియోను చూసి ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యారు. దీని రూపకర్తను కలవాలనుందంటూ వెల్లడించారు. ఇది ఎంతో సృజనాత్మకంగా ఉందని కొనియాడారు.