Diksha Singh : రాజకీయాల్లోకి బ్యూటీ క్వీన్.. పంచాయతీ ఎన్నికల బరిలో మిస్ ఇండియా రన్నరప్

ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్ మెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. అందరి చూపు దానిపైకి మళ్లింది. ఎందుకంటే

Diksha Singh : రాజకీయాల్లోకి బ్యూటీ క్వీన్.. పంచాయతీ ఎన్నికల బరిలో మిస్ ఇండియా రన్నరప్

Diksha Singh

Updated On : April 3, 2021 / 11:57 AM IST

Diksha Singh : ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్ మెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. అందరి చూపు దానిపైకి మళ్లింది. ఎందుకంటే, ఇక్కడి 26వ వార్డు నుంచి ప్రముఖ మోడల్‌, అందాల రాణి, మిస్ ఇండియా రన్నరప్ దీక్షా సింగ్‌ బరిలోకి దిగుతున్నారు.

దీక్షా సింగ్ 2015లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచారు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాటు పలు యాడ్స్ లో నటించారు. ఇప్పుడు తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దీక్ష తండ్రి జితేంద్ర సింగ్‌.. పంచాయతీ ఎన్నికల్లో బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లోని 26వ వార్డు నుంచి పోటీ చేసేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు.

అయితే ఈ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో ఆయన తన కూతురు దీక్షను బరిలోకి దించుతున్నారు. దీక్షా సింగ్.. బీజేపీ దివంగత నేత రామ చంద్ర సింగ్ కోడలు షాలినీ సింగ్‌తో తలపడనున్నారు. దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామం. వ్యాపార రీత్యా గోవాలో సెటిల్ అయ్యారు. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. దీక్షా సింగ్ తల్లి గృహిణి.

యూపీలో ఏప్రిల్‌ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జాన్‌పూర్‌ జిల్లాలో తొలి విడతలో భాగంగా ఏప్రిల్‌ 15న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో రబ్బా మెహర్ కరీ అనే పాటలో దీక్షా కనిపించింది. అనేక కంపెనీల యాడ్స్ లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Diksha Singh (@dikshajsingh)