PM Narendra Modi : పుట్టినరోజున మెట్రోలో ప్రయాణించిన మోడీ.. సెల్ఫీలు దిగిన ప్రయాణికులు

ప్రధాని మోడీ తన పుట్టినరోజున సందర్భంగా మెట్రోలో ప్రయాణించారు. ద్వారక సెక్టార్ 21 నుంచి పొడిగించిన ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్‌ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రయాణికులు మోడీతో సరదాగా సెల్ఫీలు దిగారు.

PM Narendra Modi : పుట్టినరోజున మెట్రోలో ప్రయాణించిన మోడీ.. సెల్ఫీలు దిగిన ప్రయాణికులు

PM Narendra Modi

Updated On : September 17, 2023 / 1:04 PM IST

PM Narendra Modi : 73వ ఏట అడుగుపెట్టిన ప్రధాని మోడీ తన పుట్టినరోజున మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో సెల్ఫీలు దిగారు. ద్వారక సెక్టార్ 21 నుండి  పొడిగించిన కొత్త ఎయిర్‌ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌ను మోడీ ప్రారంభించారు.

Namo App New Feature : మోడీతో దిగిన ఫోటో మిస్ అయ్యిందా? నమో యాప్‌లో దొరికేస్తుంది

ప్రధాని మోడీ తన పుట్టినరోజు సందర్భంలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ద్వారకా సెక్టార్ 21 నుండి కొత్త మెట్రో స్టేషన్ వరకు పొడిగించిన ఎయిర్ పోర్ట్ ఎక్స్‌టెన్షన్ లైన్‌ను మోడీ ప్రారంభించారు. దీనిని యశోభూమి ద్వారకా సెక్టర్ 25 అని పిలుస్తారు. ఈ సందర్భంలో మోడీ ప్రయాణికులతో ఇంటరాక్ట్ అయ్యారు. కొందరు ప్రయాణికులు మోడీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంలో మోడీ ఢిల్లీ మెట్రో కార్పోరేషన్ (DMRC) సిబ్బందితో మాట్లాడారు.

Anand Mahindra : G20 లీడర్లకు అరకు కాఫీ బహుమతిగా ఇచ్చిన మోడీ.. హ్యాపీ ఫీల్ అయిన ఆనంద్ మహీంద్రా

దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన ‘యశోభూమి లైన్’ ద్వారకా సెక్టార్ 21.. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను కలుపుతుంది. ఈ లైన్ మొత్తం పొడవు 24.9 కిలోమీటర్లు ఉంటుందని DMRC ఒక ప్రకటనలో తెలిపింది.